29.2 C
Hyderabad
May 11, 2024 00: 02 AM
Slider కవి ప్రపంచం

చివ‌ర‌కు మిగిలేది…

#TirunagariSrinivasNew

నేనూ లేను
నువ్వూ ఉండ‌వు
చివ‌ర‌కు మిగిలేది జ్ఞాప‌క‌మే
నిన్నింకోసారి
తెలియ‌నోళ్ల‌కు
ఎరుక‌చేసి
క‌న్నీటిని నీకై
విదిలింప జేసేది
త‌డార‌ని జ్ఞాప‌క‌మే
ఎదురుచూపులు
ఆర్తిని తాగిన ఆశ‌లు
క‌ట్ట‌లు తెంపే ఆలోచ‌న‌లు
బ‌రిగీత‌ల తెగింపులు
బ‌ల‌హీన‌త‌ల‌పై అద‌లింపులు
ఎన్ని ఉన్నా… ఏది ఏమైనా
నీకు కాన‌రాని
నువ్వు చూడ‌లేని
నిశాంత ప్ర‌శాంత నిఖిల ప్రపంచాన్ని
నీకై ఆవిష్క‌రించేది ఖ‌చ్చితంగా
నువ్వు ఇంద‌రి మ‌ధ్య వ‌దిలివెళ్లిన జ్ఞాప‌క‌మే
అందుకే
బ్ర‌తికిన రోజే
నువ్వు గుండెల్లో గొప్ప‌జ్ఞాప‌క‌మై నిల‌వాలి
నీవంటూ లేనివాడు
ఆ జ్ఞాప‌క‌మే నీ స్ఫూర్తి దీప‌మై వెల‌గాలి

తిరున‌గ‌రి శ్రీ‌నివాస్, 8466053933 

Related posts

తిరుపతిలో కరోనా లాక్ డౌన్ అమలు నామమాత్రమే!

Satyam NEWS

యురేనియం మైనింగ్‌పై కేటీఆర్ ట్వీట్

Satyam NEWS

డబ్బు రెట్టింపు చేస్తామని చెప్పి మోసం చేసే గ్యాంగ్ అరెస్టు

Satyam NEWS

Leave a Comment