27.7 C
Hyderabad
May 16, 2024 07: 00 AM
Slider ప్రత్యేకం

Hats off: భీమార్జున రెడ్డి గారూ…. మీ అంకితభావానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం

#suryapet

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని డిగ్రీ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్న కళాశాల ప్రిన్సిపాల్ భీమార్జున్ రెడ్డి ని ప్రతిఒక్కరూ అభినందించక తప్పదు.

పొద్దు పొద్దునే కళాశాల గేటుకు రంగులు వేస్తూ వాకింగ్ కు వెళుతున్న నెటిజన్ల చరవాణికి చిక్కిన చిత్రాలు. సాధారణంగా రోజూ లాగానే ఉదయాన కొందరు నెటిజన్లు తమ మిత్రులతో కలసి గ్రౌండ్ కు వాకింగ్ కు వెళ్ళారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డిగ్రీ కళాశాల మెయిన్ గేట్ కు పొద్దున్నే ముగ్గురు వ్యక్తులు పెయింటింగ్ వేస్తూ కనిపించారు. పెయింటర్ లు ఇంత పొద్దున్నే పని చేయటానికి వచ్చారేంటబ్బా అని ఆశ్చర్యచకితులయ్యారు.కానీ అక్కడే పొరపడ్డారు వారు. పక్కనే ఉన్న తోటి మిత్రుని అడిగారు ఎవరు వారు ఇంత పొద్దున్నే రంగులు వేస్తున్నారని అప్పుడు ఆ మిత్రుడు చెప్పాడు. డిగ్రీ కళాశాల గేటుకు రంగు వేసే వారిలో టోపి పెట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు ఆయన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భీమార్జున్ రెడ్డి అన్నారు.

వాకార్స్ ఆశ్చర్య పోయారు. దగ్గరకు వెళ్లి వెంటనే ఆయన్ని పలకరించారు. వయసులో చిన్న వాడైనా నమస్కారం పెట్టారు. ఆయనలో ప్రిన్సిపాల్ అనే దర్పం ఇసుమంతైనా లేదు. సాదా సీదాగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. రాత్రంతా కళాశాలలోనే ఉండి పొద్దున్నే గ్రంధాలయాధికారి నాగరాజు,మరొక విద్యార్థితో కలిసి రంగులు వేసే పనికి పూనుకున్నారు. కళాశాలకు నిధులు లేనందున స్వయంగా రంగులు వేయటం ప్రారంభించారు. చూస్తున్నవారికి మాత్రం సంభ్రమాశ్చర్యం,సంతోషం కలిగించింది.

భీమార్జున్ రెడ్డి అంకితభావం, పట్టుదల చూసి,తన సహచర అధ్యాపకుల సహాయ,సహకారాలతో అనేక పనులు చేశారు.కళాశాలకు రంగులు వేయించారు. కావలసిన మౌలిక అవసరాలు సమకూర్చారు. కళాశాలలో చక్కటి అందమైన గార్డెన్ పెంచారు. కళాశాల గ్రీనరి మయం చేశారు.

కొందరు ఉద్యోగులు సమయానికి కళాశాలకు రావటమే గగనమైన ఈ రోజుల్లో రాత్రులు కళాశాలలోనే ఉండి కాలేజీ గురించి ఆలోచించడం అభినందనీయం. కాలేజిలో 14 మంది అధ్యాపకులు 350 మంది విద్యార్థులు ఉన్నారంటే ఆనందం కలిగించింది వారికి. కాలేజీలో జరిగిన ప్రతి అభివృద్ధిలో తన సహచర అధ్యాపకుల కృషి ఉన్నట్లు ప్రిన్సిపాల్ వారితో అన్నట్లు నెటిజన్లు తెలిపారు. ప్రతి పనికి లంచం తీసుకునే ఈ రోజుల్లో ఇలాంటి నిస్వార్థం,నిజాయితీ,నిబద్దత గల ప్రిన్సిపాల్ హుజూర్ నగర్ డిగ్రీ కళాశాలకు దొరకడం నిజంగా ఓ వరమనే చెప్పాలి.

బాచిమంచి చంద్రశేఖర్, సత్యం న్యూస్.నెట్, హుజూర్ నగర్

Related posts

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

Satyam NEWS

విశాఖలో కిరాతకం: ఆరుగురి దారుణ హత్య

Satyam NEWS

అడిషనల్ డీసీపీ (ఏఆర్)ను కలసిన ఖమ్మం హోంగార్డు అసోసియేషన్

Satyam NEWS

Leave a Comment