29.7 C
Hyderabad
May 3, 2024 05: 44 AM
Slider కడప

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

#ramjan

అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం లోని రాచుపల్లి మజీద్ ఆవరణలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా రాజంపేట శాసన సభ్యులు  మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి  మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా రాజంపేట నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు.

ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి అందరం ఒక్కటని, అందరం సోదర భావంతో మెలగాలనే ఆలోచనతోనే ఈ ఇస్తార్ విందు కార్య క్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. జడ్పీ చైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి మాట్లాడుతూ సర్వ మతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అందువల్ల మైనార్టీ సోదరులు ఈ మాసన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు.

అలాగే ముస్లిం సోదరులందరూ  ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లాహ్ మన్ననలు పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లాహ్ అనుసరించిన మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు గడ్డం జనార్దన్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి,  మండల కన్వీనర్ గజ్జల శ్రీనివాసులు రెడ్డి,ఎంపీటీసీ లక్ష్మీదేవి ,సర్పంచ్ బాదుల్లా,బి  గురు, గురు మోహన్ రాజు, ఎంపీటీసీ పిడుగు సుబ్బారెడ్డి, ఎస్ సుభాన్, భాషా, వెంకటరామ్ రాజు , ఎన్ ప్రభాకర్ రాజు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ ఫొటోలోని పాప బాగుందా? కానీ ఆ దుర్మార్గురాలికి….

Satyam NEWS

గారశేషు కుటుంబానికి అండగా నిలబడాలి

Bhavani

డిఫరెంట్ లవ్ స్టోరీస్ తో “లాట్స్ ఆఫ్ లవ్” నేడే విడుదల

Satyam NEWS

Leave a Comment