32.2 C
Hyderabad
May 16, 2024 12: 54 PM
Slider ముఖ్యంశాలు

విద్యార్థులు రాసిన సొంత ఊళ్ళ చరిత్ర

#Sahitya Akademi

తెలంగాణ సాహిత్య అకాడమి చేపట్టిన ’’మనవూరు -మన చరిత్ర‘‘ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండువేల గ్రామాల చరిత్ర నమోదు అయ్యిందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఒక సంవత్సర కాలంగా సాహిత్య అకాడమి డిగ్రీ విద్యార్థులచే సొంత ఊళ్ళ చరిత్రను రాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అపూర్వమైన స్పందన లభించిందని ఆయన తెలిపారు.

ఖమ్మంలోని ఎస్ఆర్&బిజిఎన్ఆర్ కళాశాల విద్యార్థులు రాసిన 568 గ్రామాల చరిత్రను కళాశాల ప్రిన్సిపాల్ డా. ముహమ్మద్ జాకీరుల్లా విద్యార్థులు కలిసి సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, జిల్లా కలెక్టర్ గౌతమ్ లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఆర్&బిజిఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ’’మనవూరు -మన చరిత్ర‘‘ ప్రాజెక్టులో జిల్లా కలెక్టరుతో కలిసి జూలూరు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులు, విద్యార్థులు సంయుక్తంగా జరిపిన కృషికి నిదర్శనంగా రెండువేల గ్రామాల చరిత్ర పూర్తి కావడం గర్వించదగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో తమ ఊరిపై ఉన్న అవగాహనను తెలపడమే కాకుండా వారిలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని చెప్పారు. అనేక గ్రామాలలో విద్యార్థులు అధ్యాపకులు, సాహిత్య అకాడమీ భాగస్వామ్యంతో క్షేత్రస్థాయికి వెళ్ళి ఊరి విశేషాలను తెలుసుకుంటుంటే తెలంగాణ లోని ప్రతి ఊరికి ఒక మహోజ్వల చరిత్ర ఉందని ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పినట్లయ్యిందని వెల్లడించారు.

తెలంగాణలోని ప్రతి గ్రామంలో నెలకొని ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చీలు, స్థానిక దేవతలు, జాతరలు, పండుగలు, ఆధ్యాత్మికంగా తరతరాలుగా జరుగుతున్న సంప్రదాయ విశేషాలను తమ ఊరిలో ఎంత గొప్పగా నిక్షిప్తమై ఉన్నాయో విద్యార్థులు తమ ఊరి చరిత్రలో నమోదు చేశారని పేర్కొన్నారు. తన ఊరిని ఆనుకుని ఉన్న నదులు, ఏర్లు, వాగులు, వంకలు, బావులు, చెట్లు, పుట్టలు, పర్యావరణ శోభతో తన ఊరు ఏవిధంగా మరిచిపోలేని యాదిగా తమ హృదయాల్లో ఎలా నిండిందో పిల్లలు కలాలు పట్టుకుని తమ ఊరి చరిత్రలో రాశారన్నారు.

బోనాలు, బతుకమ్మలు, జాతరలు, కులదైవాల మొక్కులు, ఈ గ్రామచరిత్రల్లో వివరించారన్నారు. హిందూ ముస్లిం క్రయిస్తవ సర్వ మతాలు, సర్వ కులాలు గ్రామంలో కలగలిసి తరతరాలుగా ఎలా సహజీవనం చేస్తున్నారో విద్యార్ధులు తమ సోయితో చాటి చెప్పారన్నారు. ఇప్పటికీ గ్రామంలో వావివరుసలతో పిలుచుకోవడం, ఎక్కువ తక్కువ స్థాయిలు మరిచి సహజీవనం చేస్తూ జీవించే జీవనవిధానాన్ని ఈ గ్రామాచరిత్రలో రికార్డు చేశారని విశ్లేషించి చెప్పారు. తమ ఊరి కోసం తమ నేల కోసం తమ జిల్లా కోసం రాష్ట్రం కోసం దేశంకోసం త్యాగం చేసిన తన ఊరి మహనీయుల చరిత్రను కూడా ఇందులో పొందుపరిచారని చెప్పుకొచ్చారు.

నాటి వీరతెలంగాణ పోరాటంలో, నేటి వేరు తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన తమ ఊరి త్యాగధనుల చరిత్ర విద్యార్థుల కలాల సాక్షిగా నమోదయ్యిందన్నారు. తమ ఊరిలో ఉన్న అంగన్వాడీ ద్వారా ఊరు బడి ద్వారా తన ఊరు పొందిన చైతన్యాన్ని చెప్పడం జరిగిందన్నారు. తమ ఊరి నుంచి ఎదిగి వచ్చిన వాళ్ళు దేశదేశాలకు ఎలా విస్తరిస్తూ పోయారో కూడా ఆ చరిత్రలో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత గత పదిసంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ’’మనవూరు -మన చరిత్ర‘‘ లో పొందుపరిచారని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో ఎస్ఆర్&బిజిఎన్ఆర్ విద్యార్థులు 568 గ్రామాల చరిత్రను రాయడం ఒక నూతన చరిత్రకు శ్రీకారం చుట్టినట్లయ్యిందని ఇది గర్వించదగిన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు గౌతమ్ మాట్లాడుతూ, చరిత్రను నిర్మిస్తున్న ప్రజలదే అసలు చరిత్ర అన్నారు. ఊరి చరిత్రను రాసిన వారిని ఊరు ఎప్పటికి గుర్తు పెట్టుకుంటుందని ఆయన తెలిపారు. ఈ నాడు ఈ విద్యార్థులు రాసిన చరిత్రే భవిష్యత్తు తరాలకు గెజిటుగా మారుతుందన్నారు. తమ ఊరి చరిత్రలను రాసి చరిత్రలో తమ కంటూ ఒక అధ్యాయాన్ని రాసుకున్న విద్యార్థులు ధన్యులన్నారు. మీ ఊరి చరిత్రలను చూస్తే మీరే కనిపిస్తారని చెప్పారు.

సాహిత్య అకాడమీ చేపట్టిన ఈ కార్యక్రమానికి అండగా నిలవడమే కాకుండా విద్యార్థులు రాసిన చరిత్ర పుస్తకాలను వెలుగులోకి తేవడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని గౌతమ్ తెలిపారు. విద్యార్థులు రాసిన 568 గ్రామాల చరిత్ర ప్రతులను కళాశాల ప్రిన్సిపాల్ మొహమ్మద్ జాకీరుల్లా సాహిత్యఅకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, కలెక్టర్ గౌతమ్ లకు అందజేశారు. ఈ సభలో డా.బి.వి.రెడ్డి, వైస్-ప్రిన్సిపాల్ డా.టి. జీవన్ కుమార్, వైస్-ప్రిన్సిపాల్, డా.సీతారాం, డా.మిల్టన్, చరిత్ర శాఖాధ్యక్షులు, డా.జె.రమేష్, తెలుగు శాఖాధ్యక్షులు, డా.సర్వేశ్వరరావు, కామర్స్ విభాగాధ్యక్షులు, డా.వరలక్ష్మి, ఆంగ్లశాఖాధ్యక్షులు, అత్తోట సాంబశివరావు,హిందీ శాఖాధ్యక్షులు తదితరులు పాల్గొన్న

Related posts

హుజూర్ నగర్ పట్టణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి

Satyam NEWS

సుభాష్ చంద్రబోస్ టాబ్లోను తిరస్కరించడం అన్యాయం

Satyam NEWS

ఎన్టీఆర్ ట్రస్ట్ నీడలో మౌనంగా ఎదిగిన మౌనిక

Bhavani

Leave a Comment