40.2 C
Hyderabad
April 29, 2024 18: 53 PM
Slider విజయనగరం

అధినేత విడుదలయ్యేంత వరకు పోరాటం ఆగదు

#vijayanagaram

అన్యాయం, అక్రమంగా, దుర్మార్గంగా మా పార్టీ అధినేత ను జైల్లో పెట్టించిన సీఎం జగన్ కు మూడిందని టీడీపీ శ్రేణులు ధ్వజమెత్తారు. బాబు ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచాలని అటు ఏసీబీ కోర్ట్, ఇటు సీఐడీ తేల్చడంతో దాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా టీడీపీ శ్రేణులు అంతా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అకస్మాత్తుగా ఆందోళన కు దిగారు. ఉన్న పళంగా ఒక్క సారి టీడీపీ అగ్రనేతలు ఐవీపీ, నాగార్జున, ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, బొద్దుల నరసింగరావు ,గంటా పొలినాయుడు తదితరులు నేతలంతా నల్ల జెండా లతో నిరసనకు దిగారు.

సాయంత్రం… నడిరోడ్డుపై ట్రాఫిక్ అపై టీడీపీ నేతలు ఆకస్మిక నిరసనలు… దీన్ని సాక్షాత్తు డీఎస్పీ గోవింద రావు ఆధ్వర్యంలో సీఐలు డా.వెంకటరావు, రూరల్ సీఐ తిరుపతి రావు ,ఎస్ఐ భాస్కరరావు, గోపాల్, గణేష్, లు అంతా బందోబస్తు నిలిచారు. ఇక టీడీపీ శ్రేణులు… రోడ్ కు ఇరువైపులా వాహనాలను నిలుపుదల చేసారు. దీంతో అటు ఎత్తు బ్రిడ్జి దాకా ,ఇటు బాలాజీ వరకు ట్రాఫిక్ స్తంభించింది.”బాబుతే మేము..” అంటూ టీడీపీ నేతలు కోళ్ల లలిత కుమారి‌ ,నాగార్జున, ఐవీపీ రాజు…తదితరులు అంతా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దాదాపు అరగంట పైగా తమ ,తమ నిరసనలు వ్యక్తం చేశారు.రోడ్ కు ఇరువైపులా వాహనాలు స్తంభించి….పూర్తి స్థాయిలో రోడ్ ను బంద్ చేసారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున మాట్లాడుతూ… బాబు ను విడుదల చేసేంత వరకు…. విరమించేది లేదన్నారు.

Related posts

సంచలనం సృష్టిస్తున్న లోకేష్ ట్వీట్

Satyam NEWS

ఓల్డ్ మాన్ ఛీటెడ్:అందిన కాడికి దోచుకున్న మోసగత్తె

Satyam NEWS

అధిక ధరలతో జనజీవనం అస్తవ్యస్తం

Bhavani

Leave a Comment