40.2 C
Hyderabad
April 26, 2024 13: 05 PM
Slider జాతీయం

సుభాష్ చంద్రబోస్ టాబ్లోను తిరస్కరించడం అన్యాయం

#mamatabenarjee

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రిపబ్లిక్ డే లో ప్రదర్శించతలపెట్టిన టాబ్లోను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం తీవ్రమైన విషయమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ నిర్ణయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన నిర్మించిన భారత జాతీయ సైన్యం స్మారకార్థం రూపొందించిన పశ్చిమ బెంగాల్ టాబ్లో ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్ లో అనుమతివ్వాలని ఆమె తన లేఖలో కోరారు. తమ టాబ్లో ను తిరస్కరించేందుకు ఎటువంటి కారణం అధికారులు చెప్పలేదని మమత తెలిపారు. ఈ చర్య బెంగాల్ రాష్ట్ర ప్రజలకు ‘బాధ’ కలిగిస్తుందని ఆమె అన్నారు. ఎలాంటి కారణాలు చెప్పకుండానే టాబ్లోను తిరస్కరించడం శోచనీయమని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన 125వ జయంతి సంవత్సరంలో ఆయనతో బాటు ఈ దేశంలోని అత్యంత ప్రసిద్ధ నాయకులైన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద దేశబంధు చిత్రాలను ఈ టాబ్లో పై ఉంచామని ఆమె తెలిపారు. చిత్తరంజన్ దాస్, శ్రీ అరబిందో, మాతంగినీ హజ్రా, నజ్రుల్, బిర్సా మొండా లాంటి దేశభక్తులను కూడా టాబ్లోలో చేర్చామని సీఎం అన్నారు. ఇది స్వాతంత్ర్య సమరయోధులను కించపరచడమేనని మమతా బెనర్జీ అన్నారు.

Related posts

మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

Satyam NEWS

వంటింటి ఘుమ ఘుమలు

Satyam NEWS

కరోనా వైరస్ పై విశాఖలో టీడీపి వినూత్న ప్రచారం

Satyam NEWS

Leave a Comment