30.3 C
Hyderabad
March 15, 2025 09: 38 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ పట్టణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి

#Hujurnagar Congress

భారత మాజీ ప్రధాని  రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి కార్యక్రమం హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హుజూర్ నగర్ ప్రధాన రహదారిలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

పట్టణ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారత ప్రధానిగా ఉన్న సమయంలో బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారని కొనియాడారు.

ఐటీ రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశముఖ్, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఇంకా స్థానిక నాయకులు బాచి మంచి గిరిబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు కస్తాల శ్రావణ్ కుమార్, ములకలపల్లి రామ గోపి, ఐఎన్టియుసి నియోజకవర్గ అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి, సుతారి వేణుగోపాల్, జక్కుల మల్లయ్య, దొంతగాని జగన్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

mamatha

కరోనా నెగెటీవ్ వచ్చినా మీరు జాగ్రత్తలు పాటించాలి

Satyam NEWS

ప్రాభవం కోల్పోతున్నప్రాచీనమైన బొబ్బిలి చరిత్ర!

Sub Editor

Leave a Comment