42.2 C
Hyderabad
April 26, 2024 15: 50 PM
Slider ముఖ్యంశాలు

భట్టి పాదయాత్ర కు ఉత్తమ్ సంఘీభావం

#Bhatti Padayatra

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 84వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు చందంపేట మండలంలోని పాతూరు తండా స్టేజ్ వద్దకు చేరుకోగా నల్గొండ పార్లమెంటు సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌

కుమార్ రెడ్డి పాదయాత్రకు స్వాగతం పలికి తమ సంఘీభావం ప్రకటించి పాదయాత్రలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఐదు నెలల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాలు తెలుసుకుని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాల గురించి ప్రజలకు వివరించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నేనావత్

బాలునాయక్, జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, పీఎసీఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి, ఎంపీపీ నుస్నావత్ పార్వతి చందు నాయక్, జడ్పీటీసీ బుజ్జి లచ్చిరాం, ఎం ఏ సిరాజ్ ఖాన్ పీసీసీ సభ్యులు నేనావత్ కిషన్ నాయక్, డిండి మండల పార్టీ అధ్యక్షులు నల్లవెల్లి రాజేష్ రెడ్డి, లెండాల మోహన్ రావు, మన్మధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇద్దరు అనుమానస్పద మృతి

Bhavani

బందీ గా ఉన్న పోలీసును అప్పగిస్తాం: మావోల కీలక ప్రకటన

Satyam NEWS

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్టు

Satyam NEWS

Leave a Comment