29.7 C
Hyderabad
May 4, 2024 06: 09 AM
Slider ప్రత్యేకం

Protest: తెలుగు అకాడమీని నీరుగార్చవద్దు

#mandalibudhaprasad

తెలుగు అకాడమీ పేరు మార్చడంపై ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలని అధికార భాషా సంఘము పూర్వపు అధ్యక్షులు డా.మండలి బుద్ధప్రసాద్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూచించారు. సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున పెల్లుబుకుతున్న వ్యతిరేకత దృష్ట్యా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇది:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ.శ్రీ వై.ఎస్.జగన్మోహనరెడ్డి గారికి,

నమస్కారములు,

తెలుగు అకాడమీ పేరు తెలుగు-సంస్కృత అకాడమీ గా మార్పు చేయడాన్ని యావత్తు తెలుగుజాతి వ్యతిరేకిస్తున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకునిరావడానికి ఈ లేఖ రాస్తున్నాను.

తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు మినహా దీనిని సమర్దించిన వారెవరు లేరు. అన్ని రాజకీయ పార్టీలు నిరసన తెలిపాయి. సామాజిక మాధ్యమాలలో ప్రజలు పెద్దఎత్తున తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలలో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజాభిప్రాయం గమనించడానికి ఇంతకంటే వేరే మార్గం ఏముంది..??

తమ మాటలు ఇతరులు అలకించాలనే కోరేవారు, ఇతరుల మాటలు తాము అలకించాలన్నది ప్రజాస్వామ్య మూలసూత్రం. అలా వ్యతిరేకించకపోతే నిరంకుశ, నియంతృత్వ పాలన అవుతుందే తప్ప ప్రజాస్వామ్య పాలన అనిపించుకోదు.

ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాలకు ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉంటే వెనక్కు తీసుకుంటాయి. దాని వలన ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది. ఇటీవల కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ప్రధాని శ్రీ నరేంద్రమోడీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ప్రతిష్టకు భంగం ఏమి కలగలేదు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో మీరు కూడా అభ్యతరం వ్యక్తం చేశారు. ప్రధాని పునరాలోచన చేసి నిర్ణయం వెనక్కు తీసుకున్నారు.

తెలుగు సంస్కృత అకాడమీ విషయంలో ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుని పునఃపరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుజాతి ఆత్మాభిమానం అంశంగా అందరూ భావిస్తున్నారు.

తెలుగు బాషాభివృద్ధికి 50 ఏళ్ల క్రితం ఏర్పడిన మొట్టమొదటి సంస్థ తెలుగు అకాడమీ. దానిని యధాతధంగా కొనసాగించి, నిధులిచ్చి పటిష్టంగా పనిచేసేలా చేయాలని ప్రజాభిప్రాయం వ్యక్తం అయింది. అలాగే దానిని విభజన ప్రక్రియ పూర్తి చేయించి, మనకు రావాల్సిన దాదాపు రూ.200 కోట్లు రప్పించేవిధంగా చర్యలు చేపట్టాలి. సంస్కృత భాషను ఎవరూ వ్యతిరేకించడం లేదు. సంస్కృత భాషకు ప్రత్యేక అకాడమీ ఏర్పాటుచేయమని అందరూ కోరుతున్నారు.

కావున తెలుగు అకాడమీని యధాతధంగా కొనసాగించి, సంస్కృతానికి ప్రత్యేక అకాడమీ ఏర్పాటుచేసేలా చర్యలు చేపట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించ ప్రార్ధన…

అభినందనలతో….

డా.మండలి బుద్ధప్రసాద్

పూర్వపు ఉపసభాపతి,

అధికార భాషా సంఘము పూర్వపు అధ్యక్షులు

Related posts

యూనియన్ బ్యాంక్ తాలూకా లోన్ మేళా

Satyam NEWS

ఒకే రోజు రెండు పరీక్షలు… అయోమయంలోఅభ్యర్థులు

Bhavani

ములుగు జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకులను తెరవాలి

Bhavani

Leave a Comment