26.7 C
Hyderabad
May 16, 2024 08: 03 AM
Slider హైదరాబాద్

లంగర్ హౌస్ హుడా పార్కును తనిఖీ చేసిన హైదరాబాద్ మేయర్

#gadwalvijayalaxmi

హైదరాబాద్ లోని  లంగర్ హౌజ్ హుడా పార్క్  పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి వెల్లడించారు. లంగర్ హౌజ్ హుడా పార్కును  కార్వన్ శాసన సభ్యులు కౌసర్ మోహినిద్దిన్ తో కలిసి సోమవారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎప్పటికప్పుడు శానిటేషన్ చర్యలు  వెంటనే చేపట్టాలని చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. కార్వాన్  సర్కిల్ వార్డ్ నెంబర్.61 లోని హుడా పార్క్ తో పాటుగా చెర్వును అభివృద్ధి చేసేందుకు  ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

లంగర్ హౌస్ ట్యాంక్ లో గుర్రపుడెక్క పూర్తిస్థాయిలో తొలగించాలని  కెమికల్స్ ద్వారా వాటర్ ట్రీట్మెంట్ చేపట్టేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ ఈ.ఈ లేక్  అధికారులు  చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నిర్మూలనకు కూడా ఎంటమాలజీ  శాఖ  చర్యలు తీసుకోవాలన్నారు. లంగర్ హౌస్ ట్యాంక్ ను హుడా పార్క్ లో దత్తత తీసుకొని 40 ఎకరాలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తామని మేయర్ తెలిపారు.

అర్బన్ బయోడైవర్సిటీ(UBD) ద్వారా  సుందరీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక శాసనసభ్యులు కౌసర్ మొహియుద్దీన్ మాట్లాడుతూహుడా పార్క, లంగర్ హౌస్ చెరువు  లో గచ్చిబౌలి బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ టోలిచౌకి నాలా నీరు చేరకుండా మూసీలో కలిసే విధంగా చర్యలు తీసుకోవాలని,  పూడికతీత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మేయర్ వెంట  ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, శానిటేషన్ DE (SWM)బేరి  వెంకటరాజు, CE lakes సురేష్ కుమార్, EE గోవర్ధన్, యు.బి.డి శ్రీనివాస్, డీసీ నరసింహ, ఇరిగేషన్ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

Related posts

సర్వీస్ రివాల్వర్ కాల్చుకున్న కోయంబత్తూర్ డిఐజి

Bhavani

వామ్మో ఇదేంటి? : టీఆర్ ఎస్ నేతల తిట్ల దండకం

Satyam NEWS

విద్యా, వ్య‌వ‌సాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద‌పీట‌

Sub Editor

Leave a Comment