42.2 C
Hyderabad
April 26, 2024 15: 36 PM
Slider మెదక్

వామ్మో ఇదేంటి? : టీఆర్ ఎస్ నేతల తిట్ల దండకం

#EdupayalaJatara

టీఆర్ ఎస్ పాలనలో ప్రభుత్వ అధికారులకు అడుగడుగునా అవమానాలు, తిట్లు, చీదరింపులు తప్పా కనీస గౌరవం కూడా దక్కడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే సైతం అధికారులను బెదిరించిన ఆడియో టేపులు, వార్తలు బయటకు వచ్చాయి.

ఇదే దారిలోనే ఛోటామోటా నేతలు సైతం తిట్ల దండకం మొదలు పెట్టారు. నోటికి వచ్చింది మాట్లాడుతూ అధికారులను అభాసుపాలు చేస్తున్నారు. ఇందుకు అనేక సంఘటనలు ఉదాహారణగా చెప్పచ్చు.

ఇటీవల మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఓ మహిళా అధికారిణిని టార్గెట్ చేస్తూ కొందరు కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు తిట్ల దండకం అందుకున్నారు. నోటికి వచ్చింది మాట్లాడుతూ అనరాని మాటలు అన్నారంటూ సదరు అధికారిణి కంటతడి పెట్టుకున్నారు.

మెదక్ లో ఛోటానేతల హాల్ చల్

మెదక్ నియోజకవర్గంలో కొందరు చోటా నేతలు హల్చల్ చేస్తున్నారు. విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చిన ఈ నేతల్లో కొందరు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎంటర్ ప్రైజెస్ పేరున లక్కీ స్కీంలు పెట్టి అమాయకుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసిన ఇద్దరు టీఆర్ ఎస్ యువ లీడర్లు.. ప్రజలను నిలువునా ముంచారన్న ఆరోపణలు ఉన్నాయి.

లక్కీ లాటరీల పేరున అధికారులను, మీడియాను మేనేజ్ చేస్తామంటూ తాము పార్ట్నర్ గా ఉన్న ఎంటర్ ప్రైజెస్ దగ్గర, ఇతర లాటరీల నిర్వాహకుల దగ్గర రూ.లక్షల రూపాయలు వసూలు చేశారని వారు సైతం ఆరోపిస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాకుండా భూ పంచాయతీల విషయంలోనూ తలదూర్చి సెటిల్ మెంట్లు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హరిత రిసార్ట్ రూం కోసం బెదిరింపులు

ఏడుపాయల దేవస్థానం సమీపంలో, అలాగే మెదక్ ఖిల్లాపై ప్రభుత్వం హరిత రిసార్ట్స్ ను ఏర్పాటు చేసింది. ఏడుపాయల దేవాస్థానం వద్ద గల హరిత రిసార్ట్స్ లో నాలుగు రూములు అద్దెకు కావాలంటూ మెదక్ టౌన్ కు చెందిన సంగ శ్రీకాంత్ అనే టీఆర్ ఎస్ యువ నాయకుడిగా చెప్పుకునే వ్యక్తి నిర్వాహకుడికి ఫోన్ చేసి అడిగారు.

అయితే కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం హరిత రిసార్ట్స్ ను అద్దెకు ఇవ్వడం లేదని చెప్పారు. కానీ సదరు నేత మాత్రం తనకే రూమ్ ఇవ్వరా అంటూ గట్టిగా దబాయించాడని, సంగ శ్రీకాంత్ తో పాటు ఆయన స్నేహితులు తమను నోటికి వచ్చిన బూతులతో తిట్టారని ఏడుపాయలలోని హరిత రిసార్ట్స్ లో పనిచేసే ప్రవీన్, మెదక్ రిసార్ట్స్ ఇంఛార్జ్ లింగం ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు రూమ్స్ అద్దెకు ఇవ్వడం లేదని చెప్పినా బండ బూతులు తిట్టారని చెబుతున్నారు. అందుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని ప్రవీన్, లింగం వెల్లడించారు. అధికార పార్టీ పేరు చెబుతూ లాటరీలు నిర్వహిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్న ఈ ఛోటామోటా నేతల వ్యవహారంపై పార్టీ పెద్దలు, పోలీసులు దృష్టి సారించాలని పలువురు బాధితులు మొరపెట్టుకుంటున్నారు.

రూమ్ ఆడిగానే కానీ తిట్టలేదు.. సంగ శ్రీకాంత్

తన స్నేహితులు హైదరాబాద్ నుండి వచ్చారని రూమ్స్ కావాలని అడిగిన మాట వాస్తవమే. కానీ మేము ఎలాంటి బూతులు తిట్టలేదు. రూమ్స్ ఇవ్వమంటే ఊరుకున్నాం అని సంగ శ్రీకాంత్ అన్నాడు.

Related posts

మంత్రి రోజా కు ఘన స్వాగతం పలికిన కరకంఠాపురం ప్రజలు

Bhavani

అప్పుల తెలంగాణగా మార్చారు

Bhavani

వైద్యం అందక విలేఖరి గుండె పోటు తో మృతి

Satyam NEWS

Leave a Comment