27.7 C
Hyderabad
May 16, 2024 05: 07 AM
Slider నిజామాబాద్

గంప, షబ్బీర్ రైతు ద్రోహులు: ఇద్దరి దిష్టిబొమ్మలతో శవయాత్ర

#kamareddy

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇద్దరు రైతు ద్రోహులని కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ భూ బాధిత రైతులు ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, తమకు న్యాయం చేయడంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ విఫలమయ్యారని ఆరోపిస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు.

కొత్త బస్టాండ్ వద్ద గలా సీఎస్ఐ గ్రౌండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు దిష్టిబొమ్మలతో శవయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే గంప, షబ్బీర్ అలీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజాంసాగర్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మలను రోడ్డు మధ్యలో ఉంచి అంత్యక్రియలు చేపట్టి దహనం చేశారు. అనంతరం రేపు ఇద్దరికి పిండాలు పెట్టడం జరుగుతుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్న రైతుల విషయంలో తమ వైఖరి తెలియజేయాలని గంప గోవర్ధన్, షబ్బీర్ ఆలీలను డిమాండ్ చేశారు. గత 10 రోజుల నుండి మాస్టర్ ప్లాన్ వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గంప, మాజీ మంత్రి  షబ్బీర్ అలీల స్పందన కరువయ్యిందన్నారు. వారి అవసరాల కోసం, రియాల్టర్లకు లాభాల కోసం రైతుల భూముల్లో నుండి 100 ఫీట్లు రోడ్డు ప్రపోజ్ చేసినట్టు ఆరోపించినా కూడా  మౌనం ఎందుకని, రెండు పంటలు పండే పచ్చని పంట భూములను ఇండస్ట్రియల్ జోన్ గా మార్చడానికి ఎవరు హక్కు ఇచ్చారని ప్రశ్నించారు.

రద్దీ పెరుగుతున్న పట్టణంలోని రోడ్లను 100 ఫీట్లు నుండి 80 కి,  80 నుండి 60 కి, ఎవరి అవసరం కోసం తగ్గించారని, కొన్ని చోట్ల రోడ్లు ఎలా మాయం అయ్యాయని  ప్రశ్నించారు. ఇకనైనా గంప గోవర్ధన్, షబ్బీర్ అలీ స్పందించి రైతు ఉద్యమానికి మద్దతు పలికి భవిషత్తు లో చేసే ఉద్యమంలో భాగస్వామ్యం కావాలన్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా రైతుల ఉద్యమ ఆగదన్నారు. అధికారులు మాస్టర్ ప్లాన్ లో సమూల మార్పులు చేసి రైతుల పక్షాన నిలవాలని అభ్యర్థించారు.

ర్యాలీ అడ్డగింతకు కాంగ్రెస్ యత్నం

మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దిష్టిబొమ్మలతో శవయాత్ర చేస్తూ చేపట్టిన రైతుల రైతుల ర్యాలీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు విఫలయత్నం చేశారు. కొత్త బస్టాండ్ నుంచి ప్రియ టాకీస్ రోడ్డు వరకు రాగానే యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ రైతుల ర్యాలీని అడ్డుకోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముఖంగా రైతుల ఉద్యమానికి షబ్బీర్ అలీ మద్దతు తెలిపి, లింగాపూర్ శివారులో గల తన భూమి విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత వరకు షబ్బీర్ అలీని రైతు ద్రోహి గానే చూస్తామని రైతులు స్పష్టం చేశారు

కాంగ్రెస్ నాయకునితో వాగ్వాదం చేస్తున్న రైతులు

Related posts

ప్రధాని మోదీతో తెలంగాణ సిఎం కేసీఆర్ భేటీ

Satyam NEWS

గోల్కొండలో ఆగస్టు 15 ఏర్పాట్లపై సమీక్ష

Satyam NEWS

2022 ఏడాది చివరికల్లా గగన్ యాన్..

Satyam NEWS

Leave a Comment