27.7 C
Hyderabad
May 16, 2024 03: 30 AM
Slider కరీంనగర్

స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని 1లక్ష డిమాండ్ చేసిన మంత్రి పిఆర్వో

gangula kamalakar

కరీంనగర్  సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు  నగర వ్యాప్తంగా పలు వాటర్ ప్లాంట్ల పై పోలీసులు మెరుపు దాడి చేసి, నాణ్యత ప్రమాణాలు పాటించని పలు ప్లాంట్ల పై కేసులు నమోదు చేశారు. దానిలో భాగంగా సుభాష్ నగర్ లోని ఓ ప్లాంట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ..పోలీసు కేసుకు భయపడి సదరు వాటర్ ప్లాంట్ యజమాని మంత్రి గంగుల పిఆర్వో బోనాల మల్లిఖార్జున్ ను ఆశ్రయించాడు..

పోలీసు కేసు లేకుండా చూడాలని స్టేషన్ బెయిల్ ఇప్పించాలని వేడుకున్నాడు.. సిఐ ,ఏసీపీ తనకు దగ్గరని ..స్టేషన్ బెయిల్ తో పాటు నాలుగు రోజుల్లో కేసుకూడా  లేకుండా చూస్తానని..ఇపుడే ఏసీపీ గారితో మాట్లాడానని  కాకపోతే వాళ్లు డబ్బులు తీసుకుంటారని  సుమారు 1 లక్ష వరకు అవుతుందని తెలిపాడు…త్వరగా డబ్బులు తీసుకుని రా అంటూ ఆర్డర్ వేసాడు… ఇట్టి విషయాన్ని ఎవరకు చెప్పొద్దు. ఏసీపీ తో మాట్లాడిన ,అమౌంట్ కూడా మాట్లాడినా…ఎవరికైనా చెబితే పోలీసులు బాద్నం  అవుతారు అంటూ  సదరు వాటర్ ప్లాంట్ యజమానికి చెప్పాడు..

ఒకసారి పోలీస్ స్టేషన్ కు రావాలని సదరు వాటర్ ప్లాంట్ యజమాని వేడుకగా ..నేను మంత్రి పిఆర్వో ను నాపేరు చెప్పు..వాళ్ళు నా దగ్గరకు రావాలి…నేను వాళ్ళ దగ్గరకు వెల్తానా…నీవు వెళ్లి  మంత్రి పిఆర్వో మల్లిఖార్జున్  సార్ పంపించాడు అని చెప్పి కలువు.. నీ పని ఐపోతది స్టేషన్ బెయిల్ ఇప్పిస్తా.. నాలుగు రోజుల్లో కేసు లేకుండా చేస్తాను… కాకపోతే డబ్బులు వెంటనే ఇవ్వాలి ..ఇవ్వాళ్ళ- రేపు అంటూ లేట్ చేయొద్దు ,తొందరగా రా గీతా భవన్ వద్ద గ్రాండ్ హోటల్ కాడికి రా అన్నాడు.

Related posts

లేబర్ కోడ్ లు రద్దు చేయకపోతే మరో చికాగో పోరాటం తప్పదు

Bhavani

విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినేలా చూడాలి

Satyam NEWS

రాహుల్ మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండు

Satyam NEWS

Leave a Comment