40.2 C
Hyderabad
May 6, 2024 18: 59 PM
Slider వరంగల్

విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినేలా చూడాలి

#Online Clases

ములుగు జిల్లాలోని అన్ని పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు వారు పని చేసే గ్రామం లోని విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వింటున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని జిల్లా సెక్టోరల్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి  తెలిపారు.

ఈ రోజు  మండలం లోని  MPPS రాంనగర్, DNTPS రాంనగర్ తండా, MPUPS కన్నాయిగూడెం లను ఆయన  సందర్శించి ప్రధానోపాధ్యులకు  పలు సూచనలు చేసారు.  గ్రామ విద్యా నమోదు పుస్తకం (village education register) ఆధారంగా గ్రామంలో ని ప్రతి విద్యార్ధి కి ఒక ఉపాధ్యాయుడిని “Matching-Barching ” చేయాలనీ సూచించారు.

ఆ ఉపాధ్యాయుడు ప్రతిరోజూ ఆ విద్యార్థులను పర్యవేక్షణ చేయాలనీ కోరారు. పాఠ్య భాగం లో ఏమైనా అనుమానం ఉంటే నివృత్తి చేయాలనీ కోరారు. గ్రామ స్థాయి లో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తన పరిధిలో గల ఉపాధ్యాయులను సమన్వయ పరిచి పర్యవేక్షణ చేయాలని కోరారు.

ప్రతీ విద్యార్థి కి పాఠ్య పుస్తకాలు అందేలా మండల విద్యాశాఖ అధికారులు చూడాలని అన్నారు. గొత్తి కోయ ఆవాస ప్రాంతాలకు ప్రత్యేకంగా గ్రామ విద్యా నమోదు పుస్తకం రూపొందించాలని సూచించారు. మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు, CRP లు విధిగా ప్రతిరోజూ ఆన్లైన్ పాఠాల ప్రసార సమయంలో పాఠశాలల  ను సందర్శించి  పర్యవేక్షణ  చేయాలనీ కోరారు.

ఆన్లైన్ పాఠాలకు సంబందించిన 1) పాఠశాల కార్యాచరణ ప్రణాళిక, 2) విద్యార్థుల దత్తత vivara, 3)ఆన్లైన్ పాఠాలు ప్రసార టైమ్ టేబుల్, 4) matching – batching 5) విద్యార్థుల పర్యవేక్షణ  ప్రొఫార్మా 1, ప్రొఫార్మా 2, 6)గ్రామ విద్యా నమోదు పుస్తకం,  7)విద్యార్థులకు  ఇచ్చే  వర్క్ షీట్ వివరాలు పాఠశాలలో  అందుబాటులో  ఉండాలని సూచించారు.

Related posts

సద్దుల బతుకమ్మ వేళ బస్తీలలో మురికి కంపు

Satyam NEWS

వృద్ధులకు పెద్ద కొడుకు కేసీఆర్‌

Murali Krishna

పవన్ కళ్యాణ్ పై ఆధారపడ్డ ఏ పీ రాజకీయం

Satyam NEWS

Leave a Comment