40.2 C
Hyderabad
April 29, 2024 17: 41 PM
Slider ముఖ్యంశాలు

కోడెర్ మండలం నుంచి బిజెపి లోకి వలసల వెల్లువ

#elleni

కొల్లాపూర్ నియోజకవర్గంలో  కోడెర్ మండలం లోని ముత్తిరెడ్డి పల్లి, తూర్కదిన్నే,మాచుపల్లి కి సంబందించిన వివిధ పార్టీ లకు చెందిన నాయకులు ఈరోజు బిజెపి తీర్థం పూచ్చుకున్నారు.వారికి బీజేపీ ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి, ఎల్లేని సుధాకర్ రావు.

మొదటగా ముత్తిరెడ్డి పల్లికి చెందిన NRI శరత్ రెడ్డి మాట్లాడుతూ  కొల్లాపూర్ అభివృద్ధి కోసం ఎల్లేని సుధాకర్ రావు చేస్తున్న కృషి, వారు ఎంతో మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ లు ఇప్పించి, బాసటగా నిలిచి,వారి జీవితాల్లో వెలుగు నింపారని తెలిపారు. గత ఎన్నికలలో ఓడిపోయినప్పటికి కొల్లాపూర్ ను విడవకుండా నిరంతరం ప్రజల్లో ఉన్నారని, సోమశిలా సిద్దెశ్వరం వంతెన, జాతీయ రహదారి తేవడం లో ఎల్లేని చేసిన పోరాటం అద్భుతం అని అన్నారు. కొల్లాపూర్ కు ఇలాంటి నాయకుడే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అలాగే కేంద్రం లో ఒక పారదర్శకమైన పాలనను అందిస్తున్న నరేంద్ర మోదీ పనితీరు నచ్చి బీజేపీ లో చేరుతున్నాట్టు శరత్ రెడ్డి వెల్లడించారు. తదనంతరం NRI శరత్ రెడ్డి కి బిజెపి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు ఎల్లేని సుధాకర్ రావు.

అలాగే తూర్కదిన్నె, మాచుపల్లి కి సంబందించిన వివిధ పార్టీ లకు చెందిన నాయకులు బిజెపి పార్టీ లో చేరుతూ,గత 20 సంవత్సరాల నుంచి అందరి నాయకులను చూశామని వారు కేవలం మాటలు చెప్పి, తీరా గెలిచిన తర్వాత ప్రజలను విస్మరించరని,కొల్లాపూర్ అభివృద్ధి కేవలం బిజెపి తోనే, ఎల్లేని సుధాకర్ రావు తోనే సాధ్యం అని భావించి ఈరోజు పార్టీ లో చేరుతున్నాం అని వారు ప్రకటించారు. వారి అందరికి కండువాలు కప్పి పార్టీ లోకి ఎల్లేని ఆహ్వానించారు.

అనంతరం ఎల్లేని మాట్లాడుతూ కొల్లాపూర్ అభివృద్ధి కేవలం బిజెపి తోనే సాధ్యం అని, ప్రతి ఒక్కరు పార్టీ కోసం తపించి పని చేయాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈసారి బిజెపి జెండా ఎగురవేసే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లేనితో పాటు పలు బిజెపి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Related posts

తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన నిషేధం అపచారం

Satyam NEWS

గిరిజన మహిళపై పోలీసుల దాడి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

Bhavani

కోటప్పకొండ తిరుణాల కోసం ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

Leave a Comment