28.7 C
Hyderabad
May 6, 2024 08: 41 AM
Slider హైదరాబాద్

ఎవ్వరు ఎటు పోయినా సరే మనకే అధికారం కావాలి

#munugodu

ఏం జరిగినా ఎవరు ఎటు పోయినా సరే మనకే అధికారం కావాలే అధికారంలో మనమే ఉండాలి. అధికార మదంతో దోచుకోవాలి. ఆడిందే ఆటగా పాడిందే పాటగా జీవించాలి. ప్రస్తుత జీవన విధానంలో అధికారం డబ్బు ఉంటే ఏదైనా గెలవచ్చు ఏమైనా చేయవచ్చు అనే ధోరణిలో ప్రతి ఒక్కరూ ఉన్నారు.

అదే ధోరణిలో రాజకీయ పార్టీలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా ప్రజల ముంగిట్లో కూడా అధికారం కోసం ఎంతగా దిగజారినతనం కంటికి కనిపిస్తున్న ప్రజల్లో మార్పు రాకపోవడం దేశ దౌర్భాగ్యం. రాష్ట్రం మొత్తం మునుగోడు ఎన్నికలే కనిపిస్తున్నాయి కానీ తీవ్ర వర్షాలకు నీట మునుగుతున్న గృహాలు కొట్టుకపోతున్న, నష్టపోతున్న జనాలను పట్టించుకునే నాయకుడే కరువయ్యారు.

అన్ని పార్టీల నాయకులు మొత్తం మునుగోడులో దర్శనమిస్తున్నారు. మునుగోడు ఓటర్లు ఒకసారి తమను తామే ప్రశ్నించుకోవాలని, ఆలోచించాలని రాష్ట్రంలో తీవ్ర వర్షాలకు ఇబ్బంది పడుతున్న సామాన్యులు పంట నష్టపోతున్న రైతులు , వర్ష బీభత్సంలో ప్రాణాలు కోల్పోతున్న పట్టించుకున్న నాయకుడే లేరని మొత్తం అధికారం చేక్కించుకోవాలనే తపనే తప్ప సేవ చేయాలని తపన లేదనేది గుర్తించి రేపటి భావి భారతాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఓటర్ పై ఉందని మునుగోడు ఓటర్లు తెలుసుకోవాలి.

రాజకీయ నాయకులు చెప్పే కల్లబుల్లి హామీలకు మోసపోకుండా మందు దావతులకు, లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేది గుర్తించాలి. కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయం చేయడం కాదని పేద మధ్యతరగతి సామాన్య ప్రజలకు జీవించే విధంగా సుపరిపాలన అందించే సామర్థ్యం ఉన్న వారిని ఎన్నికల్లో ఎన్నుకోవాలని అప్పుడే ఊరు వాడా బాగుంటుందనేది గుర్తించాలి.

ప్రస్తుత రాజకీయంలో ప్రజలకు సేవ చేసే నాయకులు ఉన్నారా? ప్రజలకు సేవ చేయాలంటే అధికారమే ఉండాలా. అనాధ శరణాలయాలు,స్వచ్ఛంద సంస్థలు, వృద్ధాశ్రమాలు, పుణ్యక్షేత్రాలలో సత్రాలు, వివిధ సంఘటనలో అన్నదానాలు ఎంతో మానవత్వంతో సేవ చేసే వారికి అధికారం ఉండే సేవలు చేస్తున్నారా. ప్రతి నాయకుడికి అధికారం కోసం తపన తప్పితే సేవ చేయాలనే ఉద్దేశం లేనే లేదు.

ఓటర్ మహాశయులు ఒక్కరోజులో  ఒక్క పూటలో ఒక్క క్షణంలో తీసుకునే నిర్ణయంతో మీ కుటుంబ వారసత్వ తలరాతలే మారుతున్నాయి.  స్వార్ధ రాజకీయ నాయకుల పరిపాలనలో ఉద్యోగాలు లేక, చదువు కొనుక్కోలేక, వైద్యం అందక నిరక్షరాస్యత  పెరిగి ప్రశ్నించే తత్వాన్ని అణగదొక్కి వెనకబడేసి ఉన్న పొలాలను అధికార మదంతో కబ్జా చేసి అధికారులు నాయకులు చేసే దోపిడీని అరికట్టాలంటే ఓటర్ మారాలి నోటాకు ఓటు వేయాలా?

పార్టీ నాయకులు మునుగోడు ఓట్లు అయిన వేను వెంటనే మునుగోడులో ఒక్క నాయకుడు కనిపిస్తాడా? మిమ్మల్ని ఆపదల్లో కష్టాల్లో ఆదుకునే నాధుడే కరువైతాడు గుర్తుంచుకోవాలి. ఒకరి నెత్తి కొట్టి  వారు అధికారంలో ఉండటానికి ఒకరికి సంక్షేమ పథకాల పేరుతో పంచుతున్నారు. రాజకీయ నాయకులు వారు బాగుండాలి వారి పిల్లలు బాగుండాలి అనుకుంటున్నాడు. కానీ ఓటరు మాత్రం నేను నా పిల్లలు బాగుండాలి దేశం అభివృద్ధి బాటలో నడవాలనే తపన ఓటర్ కి  లేకపోవడం దురదృష్టం. ఒక్కరోజు తాగుడుకు దావతుల కోసం తన జీవితమే కాక తన పిల్లల భవిష్యత్తును కూడా తాకట్టు పెడుతున్నాడు. ఓటర్ మారాలి భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి. సోమరితనానికి సంక్షేమ పథకాలకు భావి భారతాన్ని తాకట్టు పెట్టరాదు.

పోలా శ్రీధర్, సత్యంన్యూస్.నెట్

Related posts

పాకిస్థాన్ లో మైనారిటీలపై ఆగని దాడులు: ఇద్దరు సిక్కుల హత్య

Satyam NEWS

ఉత్త‌మ క్రీడాకారులుగా ఎద‌గాలి : జేసీ వెంక‌ట‌రావు

Satyam NEWS

బిగ్ మిస్టేక్:కాంగ్రెస్ పార్టీని వీడేది కాకుండే

Satyam NEWS

Leave a Comment