Slider నల్గొండ

అద్దెలు చెల్లించని వారిని మసీదు కాంప్లెక్స్ షాపుల నుండి పంపేయాలి

#hujurnagar

నామమాత్రపు అద్దె చెల్లిస్తూ ముస్లింలను మోసం చేస్తున్న వ్యాపారులను మసీదు కాంప్లెక్స్ నుంచి బయటకు పంపాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ముస్లింలు చేస్తున్న ఆందోళన రోజు రోజుకు తీవ్రమౌతున్నది. నేడు ఆర్డీవో కార్యాలయం ఎదుట ముస్లిం సోదర, సోదరీమణులు నిరసన వ్యక్తం చేస్తూ డి.ఎ.ఓ కమలాకర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరీమణులు మాట్లాడుతూ గత నెల 27వ తేదీన ఆర్డీవో అధ్యక్షతన జరిగిన సమావేశంలో షాపుల కిరాయిలు పెంచాలని తీర్మానించటం జరిగిందని, ఆ విషయం వక్ఫ్ బోర్డు అధికారులకు సమర్పించినా నేటి వరకు అక్రమ లీజుదారులపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని వారు ప్రశ్నించారు.

హుజూర్‌నగర్ పట్టణంలో స్థానిక ఉస్మానియా మసీదు వక్ఫ్ షాపింగ్ కాంప్లెక్స్ లో అద్దె చెల్లించని వారిని డీఫాల్టర్స్ గా గుర్తించి మసీదు కాంప్లెక్స్ లో వారికి స్థానం లేకుండా చేయాలన కోరారు. వక్ఫ్ బోర్డు అధికారులారా ఇకనైనా మేలుకొని వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలి అని వారు అన్నారు.

వివిధ మసీదుల్లో పనిచేసే సిబ్బందికి 13 నెలలుగా జీతాలు రాకపోతే వారు కుటుంబ పోషణ ఎంత భారమవుతుందో వక్ఫ్ బోర్డు   అధికారులకు కనిపించటం లేదా అని ఈ సందర్భంగా తమ ఆవేదనను ముస్లిం సోదర సోదరీమణులు వ్యక్తం చేశారు. మసీదు వారి షాపులను వెంటనే వేలం వేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు స్థానం కల్పించకుండా కాంప్లెక్స్ లపై కోట్లు సంపాదిస్తూ,మసీదుల అభివృద్ధికి, ముస్లింల సంక్షేమం కోసం పాటుపడని అక్రమ దుకాణదారులకు వ్యతిరేకంగా ఎవరున్నా,ఎంతటి వారినైనా,వదిలేది లేదని,అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ విషయాన్ని తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను వెంటనే పరిష్కరించి ముస్లిం సోదరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీల మహిళలు,నాయకులు,షేక్.ఆసియా, షేక్.జాన్ బి,షేక్.లాలమ్మ,షేక్.సుభానీబి షేక్.సుల్తాన్,మహ్మద్.జాకీరాబీ, షేక్.జమిల,షేక్.మస్తాన్ బీ,షేక్.హుస్సేన్ బి,జనిమియా షేక్.నజీర్,షేక్.యూసుఫ్, రజాక్,జనిబాయ్,షేక్.జానీ,షేక్ సైదా, షేక్.నాగులు,డ్రైవర్ ముస్తఫా, మొయిన్,సలీమ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ద్వారకా తిరుమలలో ముగిసిన మహా పాశుపత హోమం

Satyam NEWS

టి.టి.డి. ద్వారా 1933 ఆల‌యాల నిర్మాణాల‌కు నిధులు మంజూరు

Bhavani

హుజూర్ నగర్ నుండి దాచేపల్లి కి ఆర్టీసీ బస్సులు నడపాలి

Satyam NEWS

Leave a Comment