Slider నల్గొండ

ఆరుబయట నమాజ్ చేసి నిరసన తెలియజేసిన ముస్లిం సోదరులు

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉస్మానియా మజీద్ వక్ఫ్ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం నలభై తొమ్మిది షాపులకుగాను మసీదు కమిటీ వారు నిర్ణయించిన అద్దె పెంచి ఇవ్వాలని దుకాణదారులను కోరడం జరిగింది. 

పెంచిన కిరాయిని సుమారు 12 నెలలుగా కొంతమంది దుకాణాదారులు కిరాయి చెల్లించకుండా కేవలం మేము నామమాత్రం అద్దె ఇస్తామని,పెంచిన కిరాయి ఇవ్వమని అంటున్నారని రాష్ట్ర పిసిసి జాయింట్ సెక్రటరీ ఎండి.అజీజ్ పాషా అన్నారు. దుకాణదారులు సుమారు 12 నెలలుగా మసీదు మెయింటనెన్స్ షాపులవారు కిరాయి ఇవ్వకపోవటంతో మసీదు అభివృద్ది కుంటుపడిందని,దీనివలన మసీదులో పనిచేసే కుటుంబాల వారి జీవనం గడవటం కష్టతరమౌతుందని అజీజ్ పాషా అన్నారు. మసీదులో ప్రార్థన చేయించే ఇమామ్,మౌజన్లకు పట్టణంలో ఉన్న ఏడు మసీదులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని,దీనికి నిరసనగా హుజూర్ నగర్ పట్టణంలోని ముస్లిం సోదరులందరూ కలిసి సోమవారం మసీదు ఆరుబయట నమాజు చేసి తమ నిరసనను వ్యక్తం చేశామని అన్నారు.

డిమాండ్లు

1.పెంచిన అద్దెను వెంటనే దుకాణదారులు చెల్లించాలి.

2.షాపింగ్ కాంప్లెక్స్ లీజుదారుల గడువు ముగిసినందున సంబంధిత వక్ఫ్ బోర్డు అధికారులు తక్షణమే బహిరంగ వేలం నిర్వహించి అర్హులైన ముస్లిం సోదరులకు దుకాణాలు కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు ఎండీ.అజీజ్ పాషా, షేక్.బిక్కన్ సాహెబ్,అబ్దుల్ రహీం, అబ్దుల్ మజీద్ సాబ్, సయ్యద్ మున్నా, మహ్మద్,రహీం పాషా,ఎండి.నయీమ్, పఠాన్ గౌస్ ఖాన్,షేక్ ఖాసిమ్,సిరాజ్,  ఎండి.జానీ, మహ్మద్ అయాజ్, షేక్. రషీద్,జాఫర్,గౌస్ పాషా, మౌలాలి, మీరా,అబ్దుల్ ఖాదర్ సాబ్, ఇబ్రహీం, ముస్తఫా, సలావుద్దీన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మానవత్వాన్ని చాటుకున్న హోమ్ గార్డు

Satyam NEWS

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కోట వద్ద రక్తదాన శిబిరం

Satyam NEWS

గుడ్ వర్క్: పేదల ఆకలి తీర్చడమే ప్రధాన ఎజెండా

Satyam NEWS

Leave a Comment