38.2 C
Hyderabad
April 29, 2024 19: 16 PM
Slider ముఖ్యంశాలు

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కోట వద్ద రక్తదాన శిబిరం

#vijaydiwas

దేశం యావత్తు గుర్తించుకోవలసిన రోజు….జులై 26. సరిగ్గా ఈ రోజు కార్గిల్ విజయదివస్. ఈ మేరకు విజయనగరం లో స్థానిక కోట జంక్షన్ ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంక్ లో, విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్  దినోత్సవం సందర్భంగా  స్వచ్ఛంద రక్తదాన  శిబిరం నిర్వహించారు.

రక్తం నిల్వలు కొరత కారణంగా వర్షాకాలంలో వచ్చే విష జ్వరాల వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతున్న తరుణంలో మరియు తల సేమియా వ్యాధిగ్రస్తులకు ఈ రక్తాన్ని అందిస్తున్నట్టు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన విజయనగరం యూత్ అధ్యక్షులు షేక్.ఇల్తామాష్  తెలియజేశారు.

భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్ ’ పేరిట పాక్ దురాక్రమణను తిప్పికొట్టి,  కార్గిల్ గడ్డపై విజయపతాకాన్ని ఎగరేసిన రోజు కార్గిల్ విజయ్ దివస్ ఈ యుద్ధంలో దేశంకోసం అమరులైన  వీర సైనికులకు గౌరవ వందనం. చేసి రక్తదాన శిబిరం మొదలుపెట్టారు.

ఈ రక్తదాన శిబిరంలో సుమారు 45 మంది  రక్తదానం ఇచ్చారు. సేకరించిన రక్త నిల్వలు  ఎన్ వి ఎన్  బ్లడ్ బ్యాంక్ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు అశోక్, సాయి, రాయల్ క్యాబ్స్ శరత్, వంశీ కళ్యాణ్, రాము, మరియు బ్లడ్ బ్యాంక్ మేనేజర్ నాగేశ్వరరావు  పాల్గొన్నారు.

Related posts

విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

Satyam NEWS

వెనువెంటనే పీఎస్ లను తనిఖీ చేస్తున్న విజయనగరం ఎస్పీ

Satyam NEWS

టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజ్: మంత్రి కెటిఆర్ ని బర్తరఫ్ చేయాలి

Satyam NEWS

Leave a Comment