38.2 C
Hyderabad
April 29, 2024 14: 56 PM
Slider రంగారెడ్డి

ఫీవర్స్ సర్వేకు మంచి స్పందన : కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్

#chikukanagar

హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గం లోని చిల్కానగర్ డివిజన్లో ఫీవర్ సర్వే మంచి స్పందన ఉందని చిలక నగర్ కార్పొరేటర్ బన్నాల గీతప్రవీణ్ ముదిరాజ్ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే లో బాగంగా సోమవారం చిల్కానగర్ డివిజన్ లో  ఫీవర్ సర్వేను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్  అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

డివిజన్లోని ఇంద్రానగర్, శ్రీనగర్ కాలనీ అంబేద్కర్ నగర్, న్యూ ప్రశాంత్ నగర్ బస్తీ, నార్త్ ప్రశాంత్ నగర్, తదితర ప్రాంతాల్లో పారామెడికల్ సిబ్బంది నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే ను జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి , ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవి, శానిటేషన్ డీఇ   చందన, సూపర్వైజర్ సుదర్శన్, ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ భోగ ప్రకాష్ , గొంగిడయ్య , టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ లు పర్యవేక్షించారు.  సర్వే లో స్వల్ప జ్వరం, జలుబు తదితర లక్షణాలు ఉన్నవారికి మందులను అందించారు.

ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి , బన్నాల ప్రవీణ్ ముదిరాజ్  మాట్లాడుతూ ప్రభుత్వం అందించే మందులను వాడాలని అనవసరంగా ప్రైవేటు హాస్పిటల్స్  ఆశ్రయించవద్దని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్  కరోనా సమయంలో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులకు గురి కావద్దని ఇంటింటికి జ్వరం సర్వే చేయించి ప్రజలకు ఉచితంగా మందులను అందిస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ఎదుల కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, మాస శేఖర్, బింగి శ్రీనివాస్, రామానుజం, శ్యామ్, బాలు పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

పనిష్ మెంట్: నిజం చెప్పిన డాక్టర్ పై బదిలీ వేటు

Satyam NEWS

గంజాయి మత్తులో పెట్రోలు బంకుపై దాడి చేసిన యువకులు

Satyam NEWS

Danger Bells: అటు ఇటూ ఊగుతున్న ‘గంట’ రాజీనామా

Satyam NEWS

Leave a Comment