38.2 C
Hyderabad
April 28, 2024 20: 03 PM
Slider హైదరాబాద్

గుడ్ వర్క్: పేదల ఆకలి తీర్చడమే ప్రధాన ఎజెండా

maganti 1

ప్రజా సేవ అంటే ఏసీ రూంలో కూర్చుని అజమాయిషీ చేయడం కాదు. మీటింగుల్లో గంటల తరబడి మాట్లాడటం కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ ముందుకు రావడం. అందులోనూ ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టడం.

ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ కరోనా లాక్ డౌన్ సమయంలో తన శక్తికి మించిన పనులు చేస్తున్నారు. కష్టం అనుకోకుండా తెల్లవారుజామున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ప్రజలతోనే ఉంటున్నారు.

వారి ఆకలి తీరుస్తున్నారు. లాక్ డౌన్ విధించిన నెల రోజుల్లో ఆయన దాదాపుగా రెండు లక్షల మందికి ఆహారం పంపిణీ చేశారు. 15 మంది వంట మాస్టర్లు ఉన్నా ఆయన స్వయంగా వంటలో సాయం చేస్తారు. రుచి చూసి బాగున్న వాటిని పేద ప్రజలకు పంచి పెడుతున్నారు.

ప్రతి రోజు రెండు నుంచి మూడు వేల మందికి నాన్ వెజ్ భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు. చికెన్, ఎగ్స్ తో బిర్యానీ తయారు చేయించి పంచి పెడుతున్నారు. ఒక్క మనిషి ఇంతలా చేయగలడా అనే స్థాయిలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శ్రమపడుతున్నారు.

బహుశ తెలంగాణ లోనే కాదు దేశంలో ఏ ఎమ్మెల్యే ఈ లాక్ డౌన్ సమయంలో ఇంత మంది ఆకలి తీర్చి ఉండరు. మధ్యాహ్నం భోజనం సమయానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని పేదల బస్తీలలో పేదలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందించే ఆహారం కోసం వేచి చూస్తున్నారంటే ఆయన చేస్తున్న సేవ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

 సొంతగా తన కిచెన్ లో నాన్ వెజ్ బిర్యానీ ప్యాకెట్లు పరిశుభ్రంగా చేయించడమే కాదు అన్నపూర్ణా క్యాంటిన్లలో మొత్తం 15 కేంద్రాలలో అవసరమైన పదార్ధాలను కూడా ఆయన సరఫరా చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వలస కూలీలు ఆకలితో ఉండటం లేదు. అభ్యాగ్యులు, యాచకులు వేరే ఎవరివైపూ చూడటం లేదు.

చాలా మంది నాయకులు సాయం చేసే సమయంలో వారు ఓటర్లా కాదా? మన పార్టీ వారా కాదా అని చూస్తారు. అంతే కానీ ఇళ్లు కూడా లేని యాచకులను, నిరుపేదలను ఆదుకోరు. అలాంటి తేడాలు చూపించకుండా మానవ సేవే మాధవ సేవ అని భావిస్తూ ఆహారం అందిస్తున్నారు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనందున ముస్లింలకు హలీమ్ తయారు చేయించి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సత్యం న్యూస్ కు తెలిపారు. మరీ ముఖ్యంగా కంటైన్ మెంట్ జోన్లలో ఉన్న ముస్లింలకు ఈ హలీమ్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారాయన. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తనకు వేదవాక్కు అని ఆయన చెప్పారు.

ఏ పేదవాడూ లాక్ డౌన్ సమయంలో ఆకలితో నిద్ర పోకూడదు అని ఆయన చెప్పిన నాటి నుంచి తాను ఆ డైరెక్షన్ లోనే పని చేస్తున్నానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ఇబ్బందుల్లో ఉన్న ఒక కుటుంబం విషయాన్ని తనకు చెప్పి సాయం చేయమని కోరారని, ఆయన చెప్పిన విధంగా చేశానని గోపీనాథ్ తెలిపారు.

నియోజకవర్గంలోని పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య పనివారు, రెవెన్యూ శాఖ సిబ్బందికి కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఎమ్మెల్యే గోపీనాథ్ చూసుకుంటున్నారు. లంచ్ సమయానికి వారికి లంచ్ ప్యాకెట్లు చేరతాయి. ఈ సౌకర్యం ఉండే సరికి ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా మరింత ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ధనంతో కాదు ఆయన చేస్తున్నది. ఇదంతా విరాళాలు వసూలు చేసి కాదు ఆయన చేస్తున్నది. తన సొంత నిధులు సమీకరించుకుని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన బాధ్యతగా చేస్తున్నారు. లాక్ డౌన్ ఉన్నంత కాలం తాను ఇలానే చేస్తుంటానని ఆయన చెబుతున్నారు.

Related posts

ఇనీషియేటీవ్: వలస కూలీల ఆకలి తీర్చడం మా బాధ్యత

Satyam NEWS

వచ్చే నెల 10న ములుగులో లోక్ అదాలత్

Satyam NEWS

కేసీఆర్ కు పెగ్గులు పడితేనే పథకాలు గుర్తొస్తాయి

Bhavani

Leave a Comment