39.2 C
Hyderabad
May 4, 2024 21: 08 PM
Slider ఆధ్యాత్మికం

జ‌న‌వ‌రి 2న నాద‌నీరాజ‌నం, సుందరకాండ అఖండ పారాయ‌ణం

svbc

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌న‌వ‌రి 2వ తేదీన 8వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.

శ‌నివారం ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 31వ సర్గ నుంచి 35వ సర్గ వరకు ఉన్న195 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేద పారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

Related posts

విలేజ్ రెజ్లింగ్: బిచ్కుందలో కుస్తీ పోటీలు ప్రారంభం

Satyam NEWS

శ్వేతా మహంతి కేంద్ర సర్వీస్ లోకి బదిలీ

Bhavani

కరోనా కంటే ప్రమాదకరంగా కరెంటు బిల్లులు

Satyam NEWS

Leave a Comment