30.7 C
Hyderabad
April 29, 2024 06: 26 AM
Slider నిజామాబాద్

విలేజ్ రెజ్లింగ్: బిచ్కుందలో కుస్తీ పోటీలు ప్రారంభం

banswada

బిచ్కుంద మండల కేంద్రంలో గల మహా ప్రసిద్ధ సంస్థాన మఠం బండాయప్ప స్వామి సంస్థాన మఠంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. చివరి రోజు కుస్తీ పోటీలు నిర్వహించి ఉత్సవాలను ముగిస్తారు. ఈ సందర్భంగా మఠాధిపతి సోమప్ప స్వామి కుస్తీ పోటీలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కుస్తీ పోటీలకు తెలంగాణ మహారాష్ట్ర కర్నాటక సరిహద్దు ప్రాంతాల నుండి మల్లయోధులు భారీ సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు.

పోటాపోటీ పోటీల్లో చివరిగా గెలుపొందిన ఇద్దరికి 1500 చొప్పున మఠాధిపతి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సోమప్ప స్వామితో పాటు సహకార సంఘం అధ్యక్షులు  బాలాజీ (బాలు)యువకులు బొమ్మల నాగేశ్, యోగేష్ పాటిల్, గణేష్ గోoడా, చింతల సీను, అవార్ సీను, డాక్టర్ రాజు బండాయప్ప, సంపంగి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాపు కులస్తుల్ని టార్గెట్ చేసిన జగన్ రెడ్డి

Satyam NEWS

29 న మంత్రుల పర్యటనను జయప్రదం చేయండి

Satyam NEWS

ఘనంగా మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment