Slider సినిమా

చివ‌రి షెడ్యూల్లోకి ఎంట‌రైన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’

Tuck Jagadeesh

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ట‌క్ జ‌గ‌దీష్’ షూటింగ్ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో చివ‌రి షెడ్యూల్లోకి ప్ర‌వేశించింది. నాని న‌టిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శుక్రవారం  హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన చివరి  షెడ్యూల్‌లో చిత్రంలోని ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు.

ఈ సినిమాలో  రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ ఫిమేల్ లీడ్స్ లో నటిస్తుండగా, జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్,ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.. ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

సాంకేతిక బృందం:

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం:  శివ నిర్వాణ‌, నిర్మాత‌లు:  సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది, సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ప్ర‌సాద్ మూరెళ్ల‌, ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌:  సాహి సురేష్‌, ఫైట్స్‌:వెంక‌ట్‌, కో-డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌ణ్ ముసులూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌), పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

Related posts

గణేష్ శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు

Bhavani

శ్రీశైలం లో అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు

Satyam NEWS

6129 కొనుగోలు కేంద్రాల ద్వారా 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Satyam NEWS

Leave a Comment