35.2 C
Hyderabad
May 1, 2024 00: 15 AM
Slider ఆదిలాబాద్

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్

#Medical Camp

నిర్మల్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు పెంబి పోలీస్ ఆధ్వర్యంలో ఖానాపూర్ గాంధీ హాస్పిటల్ సౌజన్యంతో పెంబి మండల కేంద్రంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.

నిపుణులైన డాక్టర్ల బృందంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మారుమూల గ్రామాల నుండి ప్రజలు ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడం ఇబ్బందిగా ఉండడం గమనించి ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశామని, ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, సమయానికి సరైన తిండి, నిద్ర లేమి వలన అనేక రకాల ఆరోగ్య సమస్యల వచ్చే అవకాశం ఉందని వారన్నారు.

ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొని ఆ సమస్యలను తొలగించుకోవాలని, వైద్య శిబిరానికి చికిత్స అందించేందుకు విచ్చేసిన డాక్టర్లు బృందానికి పోలీసు అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సేవలను సుమారు 1000 మంది చుట్టు పక్కన గ్రామాల ప్రజలు వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా కరోనా వైరస్ పట్ల ప్రజలు తమ వంతు బాధ్యతగా ఒకరికి ఒకరు రెండు మీటర్ల దూరం పాటించిలని, మాస్కులు ధరించిలని, శానిటైజర్ వాడుతూ సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంబి ఎస్.ఐ రాజేష్, సర్పంచ్ పూర్ణచంద్ర  గౌడ్, యంపిపి మరియు సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Related posts

అనంతపురంలో గడప గడపకు మన ప్రభుత్వం

Satyam NEWS

యోగాతో ఆరోగ్యం.. ఆనందం

Satyam NEWS

డెత్ హంటర్స్: విద్యుదాఘాతానికి ఎంపీటీసీ బలి

Satyam NEWS

Leave a Comment