34.7 C
Hyderabad
May 5, 2024 01: 52 AM
Slider క్రీడలు

6వ ఎలైట్ ఉమెన్స్ నేషనల్ టైటిల్ లో ఛాంపియన్ గా నిలిచిన నిఖత్ జరీన్

#Elite Women

కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ చేజిక్కించుకున్న నిజామాబాద్ బిడ్డ బాక్సర్ నిఖత్‌ జరీన్‌..తాజాగా.మధ్యప్రదేశ్ బోపాల్ లో జరిగిన 6వ జాతీయ ఎలైట్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్ నెగ్గడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన తుదిపోరులో రైల్వేస్‌ (RSPB) బాక్సర్‌ అనామికతో తలపడి ఏకపక్ష విజయం నమోదు చేసింది.50 కేజీల మహిళల ఫైనల్లో నిఖత్‌ 4-1 తో రైల్వేస్‌ బాక్సర్‌ అనామికపై గెలుపొందింది.పోరు ఆరంభం నుంచే వరుస పంచ్‌లతో విరుచుకుపడిన నిఖత్‌కు, అనామిక కనీస పోటీనివ్వలేకపోయింది.

నిజామాబాద్ గడ్డ కీర్తి ప్రతిష్టలు,తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని చిరస్థాయిలో నిలిచిపోయేలా తన ప్రతిభను కనబరుస్తున్న నిఖత్ జరీన్ కు మంత్రి వేముల శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటాలని ఆకాంక్షించా

Related posts

ఒక మహిళ మరొక మహిళను ప్రోత్సహిస్తేనే ప్రగతి

Satyam NEWS

అంజలికి “సేవానందిని” పురష్కారం

Murali Krishna

చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన దాడి అ ప్రజాస్వామికం

Bhavani

Leave a Comment