33.2 C
Hyderabad
May 4, 2024 00: 28 AM
Slider పశ్చిమగోదావరి

పెదకడిమి రావుల చెరువు వేలం పాట వాయిదా

#Ravula pond

ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదకడిమి పంచాయతీ రావుల చెరువు వేలం పాట వారం రోజులు నిలుపుదల చేస్తూ హై కోర్ట్ స్టే ఇచ్చింది. ఈ చెరువు పై రజకులకు పంచాయతీకి మధ్య వేలం విషయం పై వివాదం ఏర్పడి హై కోర్ట్ వరకు వెళ్లారు. చెరువుకు వేలం పాట పెడితే పంచాయతీ ఆదాయం పెరుగుతుందని పంచాయతీ పాలక వర్గం కోర్ట్ కు వెల్లింది.

1978 లో ప్రభుత్వం 343 జి ఓ ప్రకారం రజకులకు వృత్తి నిర్వహణకు చెరువు కేటాయించాల్సి ఉంది. కొన్నేళ్లుగా తాతలు తండ్రులు రావుల చెరువులోనే వృత్తి నిర్వహిస్తున్నారని ఈ చెరువు లో ప్రభుత్వం దోబీ ఘాట్లు కూడా నిర్మించిందని కోరుతూ రజకులు కూడా హైకోర్టు ను ఆశ్రయించినట్టు తెలిసింది. అయితే ఇటీవల హైకోర్టు పంచాయతీ పాలక వర్గానికి అనుకూలం గా రావుల చెరువు కు వేలం నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది.

హైకోర్టు ఉత్తర్వులను పంచాయతీ అధికారులు అమలు చేయలేదు. దీనిపై సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టవలసిన సమయం లో జిల్లా అధికారులు కలెక్టర్ నేతృత్వం లో ఒక కమిటీ ఏర్పడి హైకోర్టు ఆదేశాలను అమలు పరిచేందుకు నిర్ణయించి ఫిబ్రవరి 9 వ తేదీన పెదకడిమి పంచాయతీ లో రావుల చెరువు కు వేలం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఈ లోగా హైకోర్టు పెదకడిమి లో రావుల చెరువు వేలం ను ఒక వారం రోజులు వాయిదా వేస్తూ స్టే ఇచ్చింది. దీనితో నేడు జరగాల్సిన రావుల చెరువు వేలం వారం రోజులపాటు ఆగింది.

Related posts

పాకిస్తాన్ లో సర్దుమణగని రాజకీయ కోలాహలం

Satyam NEWS

తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 22వ తేదీ వ‌ర‌కు సిఫార్సు లేఖ‌లు బంద్

Satyam NEWS

ప్రాజెక్టుల భూసేకరణ వేగంగా చేయాలి

Satyam NEWS

Leave a Comment