33.2 C
Hyderabad
May 4, 2024 02: 28 AM
Slider మహబూబ్ నగర్

ప్రజల ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచవద్దు

#wanaparthypolice

వనపర్తి   జిల్లా ఎస్.పి రక్షిత కె మూర్తి వనపర్తి టౌన్  పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఎస్పీ  అక్కడి అధికారులకు పలు సూచనలు చేస్తూ ప్రతి రోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, విధుల పట్ల అంకితభావంగా ఉండాలని,  ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

 పోలీస్ స్టేషన్ లోని వర్టికల్స్ నిర్వహణ, ఆన్ లైన్ వినియోగించు విధానము,  ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు  గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు.  వాహనాల సంబందించిన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి అన్నారు.  ఈ కార్యక్రమంలో యస్ ఐ యుగంధర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

లైంగిక ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా

Sub Editor

అక్రమాయుధాల డీలర్ల అరెస్టు: భారీగా ఆయుధాల స్వాధీనం

Bhavani

కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భారీ వర్ష సూచన

Satyam NEWS

Leave a Comment