34.2 C
Hyderabad
May 10, 2024 14: 37 PM
Slider విజయనగరం

పోలీసు అమరవీరుల త్యాగాలు వృధా కారాదు

#pol

పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయనగరం పోలీసుశాఖలో పని చేసి, సమాజంలో శాంతిని నెలకొల్పడంలో భాగంగా విధి నిర్వహణలో మావోయిస్టులతో పోరాడి మృతి చెందిన పోలీసు అమరవీరుల కుటుంబాల నివాస గృహాలను, వారు విద్యాభ్యాసం చేసిన పాఠశాలలను పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శించారు.

జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశాలతో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, విజయనగరం వన్ టౌన్ సిఐ డా. బి. వెంకటరావు టూటౌన్ సీఐ ఎన్. హెచ్. విజయ ఆనంద్, ఎస్. కోట సిఐ ఎస్. బాలసూర్యారావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరులు షేక్ ఇస్మాయిల్, చిట్టిపంతుల చిరంజీవిరావు ఇండ్లను సందర్శించి, వారు విద్యాభ్యాసం చేసిన కస్పా హై స్కూల్, కొట్టాం జెడ్ పి హై స్కూల్ సందర్శించి, విద్యార్థులతో మమేకమయ్యారు.

ఈ సందర్భంగా డిఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ మావోయిస్టు దాడిలో మరణించిన పోలీసు అమరవీరుడు షేక్ ఇస్మాయిల్ 1966లో పోలీసుశాఖలో ఎఆర్ కానిస్టేబులుగా జాయిన్ అయి, డ్రైవరుగా విధులు నిర్వహించేవారన్నారు. గతంలో షేక్ ఇస్మాయిల్ కస్పా హై స్కూలులోనే చదువుకున్నారన్నారు. 2001 సం. ఫిబ్రవరి 1న కురుపాం మండలం లోవలక్ష్మీ పురం గ్రామ శివార్లలో ఒక కానిస్టేబులును మావోయిస్టులు గాయపర్చి, అతని వాహనాన్ని దగ్ధం చేసారు.

ఈ సంఘటన జరిగిన తరువాత పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలతో సంఘటన స్థలంకు పోలీసు బృందాన్ని తీసుకొని, పోలీసు వాహనంలో వెళ్ళుచండగా మావోయిస్టులు మాటువేసి, మందుపాతరలను ప్రేల్చడంతో, పోలీసు వాహనంకు డ్రైవరుగా ఉన్న షేక్ ఇస్మాయిల్తో పాటు 1993 బ్యాచ్ కానిస్టేబులు బి. శ్రీరాములు కూడా తీవ్రంగా గాయపడి, సంఘటనా స్థలంలోనే మరణించారన్నారు.

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన షేక్ ఇస్మాయిల్ చరిత్ర రాబోయే తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో  కస్పా హై స్కూలును సందర్శించడం జరిగిందన్నారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన షేక్ ఇస్మాయిల్ను స్మరించుకోవడం, శ్రద్ధాంజలి ఘటించడం మన బాధ్యతని డిఎస్పీ ఆర్.గోవింద రావు అన్నారు. అదే విధంగా ఎస్.కోట మండలం కొట్టాం జెడ్ పి హైస్కూల్లు విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు సందర్శించారు.

ఈ సందర్భంగా డిఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ మావోయిస్టు దాడిలో మరణించిన పోలీసు అమరవీరుడు చిట్టిపంతులు చిరంజీవిరావు 1985లో పోలీసుశాఖలో సివిల్ కానిస్టేబులుగా జాయిన్ అయి, పొలీసు స్టేషన్లలో విధులు నిర్వహించేవారన్నారు. గతంలో చిట్టిపంతుల చిరంజీవిరావు ఎస్.కోట మండలం కొట్టాం జెడ్.పి హై స్కూల్లోనే చదువుకున్నారన్నారు.

సాలూరు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇన్స్పెక్టర్ ముద్దాడ గాంధీ  గన్ మేన్ లుగ వ్యవహరించారు. 2001  నవంబరు 28న సాలూరు న్యాయ స్థానంలో ఒక కేసు సంబంధించి సాక్ష్యం చెప్పేందుకు వెళ్ళిన గాంధీగారితో పాటు, ఆయన అంగరక్షకుడిగా వెళ్ళిన చిరంజీవిరావుపైన కూడా మావోయిస్టులు అతి కిరాతకంగా కాల్పులు జరిపారు. మావోయిస్టుల దొంగదెబ్బతో ఇన్ స్పెక్టరు ముద్దాడ గాంధీగారితో పాటు అంగరక్షకుడు చిట్టిపంతులు చిరంజీవిరావు గమ సాలూరు న్యాయ స్థానం లోనే ప్రాణాలు కోల్పోయారు.

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన చిట్టిపంతులు చిరంజీవి చరిత్ర రాబోయే తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో  కొట్టాం జెడ్పి హై స్కూలును సందర్శించడం జరిగిందన్నారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన షేక్ ఇస్మాయిల్ను స్మరించుకోవడం, శ్రద్ధాంజలిఘటించడం మన బాధ్యతని డిఎస్పీ ఆర్. గోవింద రావు అన్నారు. పోలీసుశాఖలో విధులను నిర్వహిస్తూ మావోయిస్టుల దాడిలో మృతి చెందిన అమరవీరులు పోలీసుశాఖ అందించిన సేవలను విద్యార్థులకు వివరించారు.

మావోయిస్టులతో వ్యక్తిగతంగా ఎటువంటి శతృత్వం లేకపోయినా శాంతియుత సమాజ స్థాపన, ప్రజల రక్షణ కోసం, మావోయిస్టులతో పోరాడి, జిల్లాకు చెందిన పోలీసులు మృతి చెంది, ప్రజల మనస్సులో చిరంజీవులయ్యారన్నారు. అటువంటి వ్యక్తుల త్యాగాలు వృధా పోకుండా మంచి లక్ష్యాలతో ఉన్నతంగా ఎదిగాలని, సమాజానికి, కన్నవారికి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకోవాలని విద్యార్థులను విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు ఉద్బోదించారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు, విజయనగరం వన్ టౌన్  సీఐ బి. వెంకటరావు, టూటౌన్ సీఐ ఎన్.హెచ్. విజయ ఆనంద్, ఎస్.కోట సిఐ ఎస్. బాలసూర్యారావు మరియు ఎస్ఐలు, భాస్కరరావు, షేక్ శంకర్, జె.తారకేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, విధ్యార్థులు పాల్గోన్నారు.

Related posts

వెబ్ సైట్ నుంచి ఖైరతాబాద్‌ గణేషుడికి పూజలు

Satyam NEWS

ఓటు హక్కు వినియోగించుకున్న జనసేనాని

Satyam NEWS

ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం

Satyam NEWS

Leave a Comment