29.7 C
Hyderabad
May 6, 2024 03: 25 AM
Slider ఖమ్మం

ఈనెల 18 నుంచి గిరిజన జాతీయ మహాసభలు

#Tribal National Conferences

దేశంలో 15 కోట్ల మంది జనాభా కలిగిన ఆదివాసి గిరిజన ప్రజల హక్కులను కాలరాస్తూ పరిపాలిస్తున్న బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలను వచ్చే ఎన్నికల్లో గద్దె దించడమే లక్ష్యంగా గిరిజనులు ఐక్యంగా ముందుకు రావాలని, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు.

ఖమ్మం సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ గిరిజన నాలుగో మహాసభల పోస్టర్ లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రం గిరిజన ప్రాంతమైన నమక్కల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 18 నుంచి 21 వరకు జరుగుతున్నాయని, మా సభలకు ప్రతినిధులుగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బానోతు బాలాజీ, భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యురాలు భూక్యా విజయ లు, ముగ్గురు హాజరవుతున్నట్లు తెలిపారు.

21న నమక్కల్ లో లక్షలాదిమంది గిరిజనులతో భారీ బహిరంగ సభ జరుగుతుందని జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో సమీకరణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు, దేశంలో గిరిజన చట్టాలు హక్కులు సమస్యల పరిష్కారం కోసం చర్చించి జాతీయస్థాయి ఉద్యమాన్ని రూపకల్పన మహాసభలో చేయబోతున్నట్లు అయిన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బానోతు బాలాజీ, భూక్యా కృష్ణ నాయక్, గుగులోతు కుమార్, బాధావత్ శ్రీనివాస్ , మూడు గన్యా నాయక్ ,బానోతు హరిచంద్, తేజావత్ కృష్ణ కాంత్ భూక్యా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కంటిన్యూస్: జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ ఆంక్షలు

Satyam NEWS

గులాబీ ద‌ళానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న బీజేపీ

Satyam NEWS

గవర్నర్‌కు పోస్ట్‌కార్డులు రాసిన తాడేపల్లి రైతులు

Satyam NEWS

Leave a Comment