27.7 C
Hyderabad
May 4, 2024 07: 35 AM
Slider

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు హైదరాబాదులో పోలీసు ఆంక్షలు

#hyderabadpolice

హైదరాబాద్ లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు పోలీసులు అనుమతినిచ్చారు. పబ్బుల్లో మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన సమయం వరకు మాత్రమే మద్యం అమ్మకాలు చేయాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు.

న్యూ ఇయర్ ఈవెంట్స్ కోసం పది రోజుల ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలని నిర్వాహకులకు పోలీసుల సూచన చేశారు. పబ్బుల్లో, ఈవెంట్స్ లో అశ్లీల నృత్యాలు అధిక శబ్దాలు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్స్, పబ్బులలో 45 డేసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలు రాకుండా చూసుకోవాలి. ఈవెంట్స్ మొత్తం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు తెలిపారు.

న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి డ్రగ్స్, అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పబ్బు ఈవెంట్స్ పార్కింగ్ ప్రదేశాల్లో డ్రగ్స్ అమ్మకాలు చేసినా యాజమాన్యం దే బాధ్యత అని, వేడుకల్లో ఈవెంట్స్, పబ్బుల నుండి బయటకు వెళ్లే వారికి క్యాబ్ లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నిర్వహకులదేనని పోలీసులు వివరించారు. స్టార్ హోటల్, పబ్స్, ఈవెంట్స్ లలో మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమంటూ బోర్డులు ఏర్పాటు చేయాలి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తాం.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికితే 10,000 జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై చర్యలు తీసుకుంటామని, పబ్బులు ఈవెంట్స్ స్టార్ హోటల్ వద్ద పార్కింగ్ యాజమాన్యాల ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు కోరారు.

Related posts

పాటల పల్లకిలో ఐక్యూ

Satyam NEWS

సెల్ఫ్ రెస్పెక్ట్: బాధ్యతలేని రాతలపై రేణూదేశాయ్ ఆవేదన

Satyam NEWS

నిరాశా నిస్పృహలతోనే టీఆరెఎస్ కార్యకర్తల పై దాడులు

Bhavani

Leave a Comment