26.7 C
Hyderabad
May 16, 2024 08: 55 AM
ఖమ్మం

పూలే జీవితం ఆదర్శం

#Mahatma Jyotiba Phule's 197th birth anniversary

మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. శ్రీ శ్రీ సర్కిల్ వద్ద గల మహాత్మా జ్యోతి బా పూలే విగ్రహానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, నామా నాగేశ్వరరావు, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.

వారియర్, డీసీఎంఎస్ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దోరెపల్లి శ్వేత, జిల్లా రైతు బంధు సమితి చైర్మన్ నల్లమల్ల వెంకటేశ్వర రావు, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా బిసి సంక్షేమ అధికారి జ్యోతి, అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


మహనీయుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని అన్నారు.అనంతరం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకలకు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ, పూలే కృషిని కొనియాడారు. సామాజిక విప్లవకారుడని, ఆయన దేనికోసం కృషి చేశారో, ఆ కృషిని ముందుకు తీసుకెళ్లడానికి కార్యోన్ముఖులు కావాలన్నారు.

సమకాలీన పరిస్థితుల కనుగుణంగా జరుగుతున్న దానికి, వారు చేసిన దానికి పోల్చుకోవాలన్నారు. ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను జరుపుతుందని, వారు ఇచ్చిన స్పూర్తిని గుర్తుచేసుకొని పది మందికి మంచి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతి బా పూలే ఫిలాసఫీ అర్థం చేసుకుంటే, మనం ఏ పద్దతిలో వెళ్ళాలో అర్థం అవుతుందన్నారు. చదువుకుంటే జ్ఞానం వస్తుందని, జ్ఞానం వస్తే జీవనంలో పురోగతి వస్తుందని, చదువు ముఖ్యమని ఆయన అన్నారు.

డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చదువుతోనే గొప్ప వ్యక్తి అయ్యారన్నారు. కులం శాపం కావద్దని, అణచివేతకు, సామాజిక వెనకబాటుకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం అనేక మంది పోరాటాలు చేశారన్నారు. వ్యక్తి, కులం కాదు ఆలోచన విధానం గొప్పదని ఆయన తెలిపారు. అవకాశం అందిపుచ్చుకుని, ఎక్కడైతే, ఏ సామాజిక వర్గం నుండి వచ్చామో వారికి న్యాయం చేయాలన్నారు. చదువుకుంటే కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుపడుతుందన్నారు. కులం పట్ల అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం వుండొద్దన్నారు.

అందరూ బాగుండాలని, ఇది ప్రతిఒక్కరూ గ్రహించాలని ఎమ్మెల్సీ అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ, కులాలను తక్కువ చేయొద్దని, గొప్పగా మాట్లాడుకోవాల ని అన్నారు. మహిళలు విద్యావంతులైతే కుటుంబం, సమాజం బాగుంటాయని ఆమె తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కళ్యాణలక్ష్మి/శాదిముబారక్ పథకం తో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ మాట్లాడుతూ, అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు జ్యోతిబాపూలే చేసిన కృషి అనన్య సామాన్యమైనదని అన్నారు. అనేక అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం వెరువకుండా పూలే నాటి సాంఘిక దురాచారాలను తుదముట్టించేందుకు ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు.

Related posts

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ఖమ్మం పోలీసుల ప్రణాళిక

Satyam NEWS

పట్టుబట్టి అసెంబ్లీలో బిల్లు పేట్టి ఆమోదించుకున్నం

Bhavani

డిసెంబర్ 5న కేరళ ముఖ్యమంత్రి విజయన్ రాక

Murali Krishna

Leave a Comment