40.2 C
Hyderabad
May 5, 2024 18: 46 PM
Slider ఖమ్మం

పట్టుబట్టి అసెంబ్లీలో బిల్లు పేట్టి ఆమోదించుకున్నం

#Minister Puvwada Ajay Kumar

రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యన్ని మరింత పటిష్ట పరచి, మరింత మెరుగు చేసేందుకే టిఎస్ ఆర్టీసి ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఅర్ చారిత్రత్మికమైన నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

రూ.150 కోట్లతో మున్నేరు ఆర్ సీసీ కాంక్రీట్ వాల్ నిర్మాణం, అసెంబ్లీలో ఆర్టీసి ని ప్రభుత్వంలో విలీనం అనంతరం ఖమ్మం విచ్చేసిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి మున్నేరు బ్రిడ్జి వద్ద భారీ సంఖ్యలో మున్నేరు ముంపు బాధితులు, ఆర్టీసి ఉద్యోగులు, శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 43 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి మనం ఎప్పటికి రుణపడి ఉండాలని కోరారు.

ఖమ్మం మున్నేరు పై బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఇప్పటికే రూ.180 కోట్లు మంజూరు అయ్యాయని, ఇప్పుడు తాజాగా పేదలను మున్నేరు వరద ముంపు నుండి రక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ కి నివేదించగా తక్షణమే రూ.150 కోట్లు మంజూరు చేసి క్యాబినెట్ లో పేట్టి అమోదించుకున్నమని పేర్కొన్నారు.అభివృద్ది, సంక్షేమంలో ప్రభుత్వం ఎక్కడ రాజీ పడదని, కేవలం ప్రజల సంక్షేమం మాత్రమే ఆశిస్తున్నదని అన్నారు.

Related posts

మెరుగైన చికిత్సకు అధునాతన రోగనిర్ధారణ పరీక్షలు

Satyam NEWS

జులై 1న ఏవోబీ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

Satyam NEWS

బోగాపురం ఎయిర్ పోర్ట్ కు ఇచ్చిన భూ సేక‌ర‌ణ లో బినామీలు…!

Satyam NEWS

Leave a Comment