32.2 C
Hyderabad
May 8, 2024 21: 59 PM
Slider ఖమ్మం

ఆకస్మిక తనిఖీ

#Mamillagudem Government High School

పదవ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీ వివేకానంద విద్యానికేతన్ లలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస మౌళిక సదుపాయాల కల్పన, ప్రహారీ గోడ భద్రత అంశాలను ఆయన పరిశీలించారు.

వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ తో సహా ఇన్విజిలేటర్లు, పరీక్షా నిర్వహణ విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి, లోనికి అనుమతించాలని, సెల్ ఫోన్ ను అనుమతించకూడదని కలెక్టర్ భద్రతా సిబ్బందిని ఆదేశించారు.

ప్రహారి గోడ సరిగా లేనిచోట భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, అధికారులు తదితరులు ఉన్నార.

Related posts

తిరుపతి మిస్టరీ హత్యకేసులో ముద్దాయి అరెస్ట్….

Satyam NEWS

ఇక నుంచి డైలీ హంట్ లో సత్యం న్యూస్

Satyam NEWS

ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్

Satyam NEWS

Leave a Comment