30.7 C
Hyderabad
April 29, 2024 06: 38 AM
Slider ఖమ్మం

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ఖమ్మం పోలీసుల ప్రణాళిక

#khammampolice

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించి ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు  క్షేత్రస్ధాయిలో దృష్టి సారించాలని అన్నారు.

ప్రధానంగా ఖమ్మం రూరల్ , కొణిజర్ల ,వైరా ప్రాంతాలలో  వేగ నియంత్రికలు, సూచిక బోర్డుల ఏర్పాటు చేయడం ,  వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి అనుసంధానం చేసే రోడ్లపై అవసరమైన చోట్ల వేగ నియంత్రికలు నిర్మించాలన్నారు. నేర నియంత్రణ కోసం గ్రామస్థాయి నుంచే చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోందని, అందులో భాగంగా ఖమ్మం కమిషనరేట్‌ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేనుసైతం, కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటు పై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు.

ప్రతీ గ్రామంలో ప్రజలు స్వచ్ఛందం గాభాగస్వామ్యమై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించే క్రిమినల్స్,తీవ్రమైన నేరాలకు పాల్పడే నిందుతులపై పిడీ యాక్ట్ అమలు కోసం ప్రతిపాదన పంపాలని ఆయన ఆదేశించారు.

ఆయా కేసుల్లో  నిందుతులకు శిక్ష  పడేలా చట్టపరమైన  కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.  పటిష్టమైన నిఘా వ్యవస్థ రూపొందించి జిల్లా సరిహద్దుల నుండి  వచ్చే గంజాయి ,గుట్కా సరఫరా చేసే   మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి తీవ్రమైన కేసులు నమోదు చేసి అక్రమ రవాణాను  పకడ్బందీగా నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

పోక్సో యాక్ట్ , క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , ఎస్సీ ఎస్టీ , గ్రెవ్ కేసుల్లో విచారణ వేగవంతం చేసి చార్జ్ షీట్ సకాలంలో దఖాలు చేసేలా పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా స్దానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడం, భవిష్యత్తులో వచ్చే పోలీస్ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఇండోర్,అవుట్ డోర్ శిక్షణ ఇస్తూ.. ప్రోత్సాహించాలని సూచించారు. ఆనంతరం పోలీస్ స్టేషన్ వారిగా పలు నేరాలపై సమీక్ష జరిపారు.

Related posts

మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

Bhavani

పైడిత‌ల్లి అమ్మ‌వారికి ప‌ట్టువస్త్రాలు స‌మ‌ర్పించిన దేవాదాయ‌శాఖ మంత్రి

Satyam NEWS

హింస ద్వేషం ప్రేరేపిస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు

Satyam NEWS

Leave a Comment