41.2 C
Hyderabad
May 4, 2024 16: 05 PM
Slider హైదరాబాద్

పెరిగిన నిత్యవసరాల ధరలు తగ్గించాలని నిరసన

#CPM party

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు తగ్గించాలని అంబర్పేట నియోజకవర్గంలోని బతుకమ్మ కుంటలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ అంబర్పేట జోన్ కన్వీనర్ ఎం.మహేందర్ మాట్లాడుతూ బిజెపి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అనేక భారాల మోపుతుందని పెట్రోల్ ,

డీజిల్, వంట గ్యాస్, ధరలను విపరీతంగా పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుందని, పేద ప్రజలకు పనులు లేక ఉపాధి దొరకక అన్నమో రామచంద్ర అంటూ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస పోతున్నారని, పట్టణాలలో పనులు లేక ఇంటికి కిరాయిలు కట్టలేక ఉండడానికి సొంత ఇల్లు లేకపోవడంతో నానా ఆవస్తులు పడుకున్నారని ప్రభుత్వం ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని వాగ్దానం చేసి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అవుతున్న ఏ ఒక్క

పేదవాడికి ఇల్లు నిర్మించవలేదని కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన నివాస పథకం కింద ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తామని ఏ ఒక్క పేదవాడికి నిర్మించవలేదని ఇంటి ఎద్దులు చెల్లించలేక ఫుట్పాత్ మీద నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు తిరుగుబాటు చేయకముందే ప్రభుత్వం దిగివచ్చి పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలు

తీసుకురావాలని ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ అంబర్పేట జోన్ కమిటీ సభ్యులు జి.రాములు, బి సుబ్బారావు, పి శేషయ్య, బస్తీ నాయకులు బాలనాగమ్మ, జరీనా, బాలమణి, స్వప్న, మీనా, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

రెడ్ లైన్: చంద్రబాబు విశాఖ పర్యటనపై పోలీసుల ఆంక్షలు

Satyam NEWS

స్వంత వర్గాన్ని వైసీపీపై రుద్దేందుకు గంటా ప్లాన్

Satyam NEWS

భద్రాద్రి జిల్లాకు మూడో స్థానం

Murali Krishna

Leave a Comment