40.2 C
Hyderabad
May 5, 2024 16: 01 PM
Slider కడప

కరోనా కట్టడి కి వైద్యులతో రాజంపేట డీఎస్పీ భేటీ

Rajampet DSP 181

రాజంపేట డీఎస్పీ కార్యాలయంలో వైద్యులతో డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు ఇస్తున్న సూచనలు పాటించి రాజంపేటను కరోనా రహిత ప్రాంతంగా చేయాలని పిలుపు నిచ్చారు.

కరోనా పాజిటివ్ ఒకటి కూడా నమోదు కాలేదని అంటే రాజంపేట పరిసర ప్రాంత ప్రజలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన లాక్ డౌన్ ను పాటిస్తూ ఇంటికే పరిమితమై రాజంపేట ను కరోనా రహిత ప్రాంతంగా చేశారన్నారు. ఇకమీదట కూడ రాజంపేట పరిసర ప్రాంత ప్రజలు ఇలాగే ఇంటికి పరిమితమై ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఇస్తున్న సూచనలు పాటించి రాజంపేటను కరోనా రహిత ప్రాంతంగా చూడాలన్నారు.

కరోనా పై వస్తున్న పుకార్లను నమ్మ వద్దన్నారు ఏప్రిల్ 20 తేది నుంచి ప్రభుత్వం జోన్లుగా విభజించి గ్రీన్ జోన్లల లో కొన్నిటికీ ప్రభుత్వం సడలింపు ఇస్తుందన్నారు. అనంతరం లాక్ డౌన్ ను అమలు పరిచేందుకు పోలీస్ వారితోపాటు విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ,NCC వారికీ డి ఎస్ పి నారాయణ స్వామి రెడ్డి, ఎస్ఐ ప్రతాపరెడ్డిలు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ పి నారాయణ స్వామి రెడ్డి వారు చేస్తున్న విధులను ప్రశంసించి అభినందనలు తెలిపారు అలాగే ఆర్టీసీ,NCC వారు నిర్వర్తిస్తున్న విధులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వ వైద్యులు వెంగల్ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

శ్రీవారి ఆలయ‌ నిర్మాణ పనులకు వడివడిగా అడుగులు

Bhavani

జేఈఈ 2020 ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంక్స్  బుక్ లెట్ విడుదల

Satyam NEWS

హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ తప్పదు?

Satyam NEWS

Leave a Comment