37.2 C
Hyderabad
May 2, 2024 14: 06 PM
Slider జాతీయం

రాపిడ్ టెస్టు కిట్లకు వెంకయ్య సర్టిఫికెట్

venkaiah naidu

కరోనా వైరస్‌ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగంగా నిర్వహించేందుకు దక్షిణ కొరియా నుంచి లక్ష సత్వర పరీక్ష (రాపిడ్ టెస్ట్) కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం ఆహ్వానించదగిన అంశమని ఆయన అన్నారు.

వీటి ద్వారా 10 నిమిషాల్లోనే ఫలితాలు రావడం.. రోజుకు 10వేల మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటం మంచి పరిణామం అని ఉప రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. ఈ పరికరాల ద్వారా కరోనా కేసుల్లో ప్రాథమిక పరీక్షలను వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా మరింత పకడ్బందీగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలను చేపట్టేందుకు వీలవుతుందని అన్నారు. కోవిడ్‌– 19 వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి రాష్ట్ర ప్రభుత్వం లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించిన విషయం తెలిసిందే. త్వరలో మరో 9 లక్షల కిట్లను దిగుమతి చేసుకోనుంది.

Related posts

కైండ్ నెస్: మానవత్వం మూర్తీభవించిన కేసీఆర్

Satyam NEWS

ఘనంగా మల్లన్న స్వామి కళ్యాణోత్సవం

Satyam NEWS

రాజ‌ధాని పేరుతో విశాఖ అభివృద్దిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడ్డుకుంటోంది….!

Satyam NEWS

Leave a Comment