29.7 C
Hyderabad
May 1, 2024 10: 18 AM
Slider ముఖ్యంశాలు

సొంత వైద్యం చేసుకునే వారిపై తెలంగాణలో నిఘా

medical shop

దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడేవారికి మెడికల్ షాపులు నేరుగా మందులు అమ్మే విధానంపై తెలంగాణ ప్రభుత్వం నిఘా పెట్టింది. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనుగోలు చేసే వారి పేర్లు ఫోన్ నెంబర్లను మెడికల్ షాపుల వారు నమోదు చేసుకుంటారు. క్వాంరటైన్ చేస్తారనే భయంతోనే ఐసోలేషన్ క్యాంపులకు వెళ్లాల్సి వస్తుందనే ఆందోళనతోనో చాలా మంది తమకు దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా కూడా దాచిపెడుతున్నారు.

తమ సొంత వైద్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారు పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల మరింత ప్రమాదం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని లేకుండా చేసేందుకు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడే వారిపై నిఘా పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ షాపులో నేరుగా మందులు కొనేవారికి ఈ విషయాలన్నీ వివరించి వారి పేరు, ఫోన్ నెంబర్, చిరునామా తీసుకోవాల్సి ఉంటుంది.

Related posts

ట్రాఫిక్ చలాన రాయితీ రాష్ట్రం అంతా అమలు

Sub Editor 2

17న తిరుమలలో కార్తీక వన భోజన మహోత్సవం

Satyam NEWS

ప్రయివేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలి

Satyam NEWS

Leave a Comment