30.7 C
Hyderabad
May 5, 2024 07: 01 AM
Slider జాతీయం

హెలికాప్టర్ ఘటనలో ఫోరెన్సిక్ కు ప్రత్యక్ష సాక్షి ఫోన్

తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్‌ సమీపంలో కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్‌ ఘటనలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మరో 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే,చ మృతికి కారణమైన హెలికాప్టర్‌ను వీడియో తీసిన వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

కోయంబత్తూరుకు చెందిన జో అనే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ డిసెంబర్ 8న తన స్నేహితుడు నాజర్, అతని కుటుంబ సభ్యులతో కలిసి కొండ ప్రాంతాలైన నీలగిరి జిల్లాలోని కట్టేరి ప్రాంతానికి ఫోటోగ్రాఫ్ లను క్లిక్ చేయడానికి వెళ్లారు. ఉత్సుకతతో అతను తన మొబైల్ ఫోన్‌లో దురదృష్టకర హెలికాప్టర్ వీడియోను రికార్డ్ చేసాడు.

పొగమంచులో హెలికాప్టర్ అదృశ్యమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కేసులో విచారణలో భాగంగా జిల్లా పోలీసులు జో మొబైల్ ఫోన్‌ను సేకరించి కోయంబత్తూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

Related posts

దేశ ప్రజలకు రాష్ట్రపతి దీపావళి శుభాకాంక్షలు

Satyam NEWS

చర్చలు సఫలం కావడంతో పెరిగిన గ్రామీణ హమాలి రేట్లు

Satyam NEWS

చనిపోయిన వ్యక్తికి ట్రీట్ మెంట్ చేస్తున్నారని బంధువుల ఆందోళన

Satyam NEWS

Leave a Comment