32.2 C
Hyderabad
May 16, 2024 11: 40 AM
Slider నల్గొండ

రైస్ మిల్లులు బందు చేసి నిరసన వ్యక్తం చేసిన యాజమాన్యం

#ricemills

ఆహార ధాన్యాలపై 5 శాతం టాక్స్ వేయాలని,జిఎస్టి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయానికి ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ ఫెడరేషన్,తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్లులు బందు చేసి తమ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు రైస్ మిల్ యజమానులు మాట్లాడుతూ క్వింటా ఒక్కంటికి 200 నుండి 300 రూపాయలు అదనంగా భారం పడుతుందని,ధాన్యం తగ్గించి కొనుగోలు చేయవలసి వస్తుందని అన్నారు.జిఎస్టి 5 శాతం టాక్స్ తక్షణమే రద్దు చేసి గతంలో మాదిరిగా ౦ శాతం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొలిశెట్టి లక్ష్మీనరసింహారావు,గజ్జి ప్రభాకర్,కుక్కడపు కోటేశ్వరరావు,ఈగా కోటేశ్వరరావు, మట్టపల్లి వెంకటనారాయణ,కుక్కడపు అనీల్,సురేందర్,దొంగరి వేంకటేశ్వర్లు, వి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ధాన్యానికి చెల్లింపు కు 39 కోట్లు

Murali Krishna

హన్స్ ఇండియా క్యాలెండర్ ఆవిష్కరించిన ములుగు ఎస్పి

Satyam NEWS

కార్మిక, కర్షక పోరు యాత్రను విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment