33.7 C
Hyderabad
April 29, 2024 02: 40 AM
Slider నల్గొండ

కార్మిక, కర్షక పోరు యాత్రను విజయవంతం చేయాలి

#Roshapathi

కొత్త వ్యవసాయ చట్టాలు, కార్మిక కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుండి ఫిబ్రవరి 2 వరకు తెలంగాణ రాష్ట్రంలో ‘కార్మిక కర్షక పోరు’ యాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం రైస్ మిల్ దిన కూలీల యూనియన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్మిక కర్షక పోరుయాత్ర సూర్యాపేట జిల్లాలో ఈ నెల 24 నుంచి 26 వరకు జరుగుతుందని, ఈ మహా ఉద్యమ యాత్రలో ప్రతి ఒక్క కార్మికుడు భాగస్వామ్యం కావాలని అన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని రైతులకు సంఘీభావంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో CITU దినసరి కూలీ సంఘం అధ్యక్షురాలు సామల కోటమ్మ, మొదాల గోపమ్మ,గుండె బోయిన వెంకన్న, చింతకాయల పర్వతాలు, మున్ని, మంగమ్మ, బుజ్జి, నాగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాఠశాలలో  కాలనిర్ణయ పట్టిక ప్రకారమే నిర్వహించాలి

Satyam NEWS

నిన్న రామ‌తీర్ధం..ఇవాళ చీపురుప‌ల్లి… పండ‌గ సంద‌ర్బంగా విజయనగరం ఎస్పీ దైవ ద‌ర్శ‌నాలు

Satyam NEWS

తెలంగాణ సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి

Satyam NEWS

Leave a Comment