38.2 C
Hyderabad
May 3, 2024 22: 44 PM
Slider నల్గొండ

మహిళలకు ఉచితంగా శానిటరీ నాప్‌కిన్స్ ఇవ్వాలి

#lelavati

తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఉమెన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదు లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆలూమ్మిని అసోసియేషన్ లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధ్యక్షుడు శశి కాకూమను ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రముఖ మహిళలందరూ  కార్యక్రమంలో పాల్గొని ఆట,పాటలతో మహిళలు ఎదుర్కొన్న సమస్యలను వివరించారు.

ఈ కార్యక్రమంలో విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకూరి లీలావతి ప్రసంగిస్తూ ప్రభుత్వ కెమికల్స్ రహిత సానిటరీ నాప్కిన్ అవసరమైన మహిళలందరికీ దేశంలో ఉచితంగా అందించాలని,దీనిపై వైద్య బృందం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ నిర్మల హెల్త్ జనరల్ సెక్రటరీ,ఎం.కల్పనా హెల్త్ ఆర్గనైజషన్ సెక్రటరీ,స్ఫూర్తి సిర్కొండ,డా. రాధికా రాణి,డా.అనిత రెడ్డి,సి హెచ్. సుజాత,టి.నిర్మల్,ఆర్.దేవిక,చెప్పు.లలిత ప్రముఖ మహిళలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు కార్యాచరణ

Bhavani

Twitter Blue: ఇక ట్విట్టర్ లో సేవలకు చార్జీలు

Satyam NEWS

న్యూ డైరెక్షన్: జమిలి ఎన్నికలతో ప్రయోజనాలు ఎన్నో

Satyam NEWS

Leave a Comment