40.2 C
Hyderabad
May 5, 2024 17: 18 PM
Slider వరంగల్

వరంగల్ నగరంలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా జరగాలి

#gundusudharani

గ్రేటర్ వరంగల్ నగరంలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా జరగాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. GWMC కమిషనర్ పి.ప్రావీణ్యతో కలసి నగరంలోని పోతననగర్ ట్రాన్స్ఫర్ స్టేషన్, పోచమ్మమైదానం, కాశిబుగ్గ, వరంగల్ బస్ట్రేషన్, శివనగర్ లలో రహదారులు, విధులులో శానిటేషన్ పరిశీలించి మరింత సమర్ధంగా చేసేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

రోడ్లపై బిన్ లో ఉన్న చెత్తను, ప్రతిరోజు క్రమం తప్పకుండా తొలగించాలని, మురుగుకాలువల చెత్తా, మట్టిని, రోడ్లపై చెత్తా పెరుకుపోకుండా ఎప్పటి కప్పుడు తొలగించాలని అన్నారు. శివనగర్ పల్లవి ఆసుపత్రి వద్ద కొనసాగుతున్న వరద నీటి నివారణకు నిర్మిస్తున్న డక్ట్ పనులను మేయర్, కమిషనర్లు పరిశీలించి పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

శివనగర్ మురుగునీరు డక్ట్కు చేరి నిర్మాణ పనులకు ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా ప్రత్యేక పైపులైన్ వేసి మురుగునీటిని మళ్లించాలని, ఈ పనులు వారంలోగా పుర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వరంగల్ వాల్మార్ట్ సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ లికేజీలను పరిశీలించిన మేయర్ ఇఎన్సీతో మాట్లాడి నగరంలో తరచుగా లికేజీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఎంహెచ్ ఓ డాక్టర్ రాజి రెడ్డి, ఈఈ శ్రీనివాస్, ఏఈ సతీష్, సానిటరీ సూపర్ వైజర్ సాంబయ్య, సానిటరీ ఇన్స్పెక్టర్లు శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైద్య సేవలను ఆరోగ్య శ్రీ పోర్టల్ లో నమోదు చేయాలి

Murali Krishna

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెలంగాణ సర్కారు

Satyam NEWS

స్థానిక రైతుల ధాన్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment