కవి ప్రపంచం

అపర రాజనీతిజ్ఞుడు

#Pandala Maheswar

ఆయనొక సాహస రాజకీయ కెరటం

అలుపెరగని  రాజనీతిజ్ఞుడు

బహుభాషాకోవిదుడు తెలంగాణ రాజకీయ యోధుడు

పెక్కు కలగళాలకు ప్రేరణదాయకుడు

సత్య వాక్పటిమా నిత్యచైతన్య శీలి…!

మాతృభాషతోపాటు పదహారుభాషల్లో కవితా సేద్యం చేసిన కళా పిపాసి…!

మనసులో మెరిసిభావాలకు

రమ్యంగా ప్రాణంపోసి…గొల్ల రామవ్వకథను రాసి

కాకతీయ పత్రికను నడిపి తెలంగాణకు సాహితీ గౌరవాన్ని కలిగించిన ఘనాపాటి…!

పాములవర్తి వంశోద్భవచంద్రుడే

పీవీజీ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా,

కేంద్రమంత్రిగా,విదేశి రాయబారిగా విశిష్ట సేవలందించిన అపరచాణక్యుడు!

ఆర్థిక సంస్కరణలవేత్తగా దక్షిణాది తొలి

ప్రధానిగా గురుతరబాధ్యతల్ని

నిర్వహించి దేశ ఆర్థిక ప్రగతికి రూపురేఖల్ని దిద్దిన ప్రణాళికాబద్దుడు

ఆర్థిక వృద్ధిరేటుకు అక్షర శిల్పి…!

పారదర్శతకు నిత్య కృషీవలుడు..!

భారత భావితరానికి ఊతంనేర్పిన

కార్యదక్షతకు ప్రాతఃస్మరణీయుడు..!

సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం…!

సాంకేతిక పరిజ్ఞాన పరికల్పన

సమ్మేళనాలకు శ్రీకారం చుట్టిన

ఆదిత్య హృదయతత్త్వుడు  పీవీజీ..!

సాహితి లోకానికి పెన్నిధిగా,

విశ్వనాథ వేయిపడగల్ని సహస్రఫణిగా అనువదించి

కేంద్ర సాహిత్య అకాడమీ నందుకున్న సాహితీమార్గదర్శిగా,

పీవీజీ …ఓ ధ్రువతార..!

తెలుగువాడిగా డిల్లీలో చక్రంతిప్పిన ఆధునిక యౌగందరాయణుడు 

రాజకీయ దురంధరుడుప్రజాస్వామ్య పరిరక్షణా ధర్మతత్త్వుడు  

పట్టుదోతుల వేష భూషణాలంకారమే ఆతని ఆత్మగౌరవం  ఠీవీ..

తెలంగాణ  హృదయ సంస్కారానికి నిలువెత్తు సాక్ష్యం ..మన పీవీజీ… !

త్రికరణశుద్దిగా జయంత్యుత్సవాలలో

జయ నీరాజన వీణగేయంగా

శతకోట్ల భారత ప్రజావాణిగా  చేతులెత్తి శిరసానమామిగా

మోకరిల్లి అక్షర పుష్పాంజలులను ఆనందంగా సమర్పిస్తూ…..!!!

డా.పాండాల మహేశ్వర్, గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి

Related posts

మన తెలంగాణ బిడ్డ

Satyam NEWS

శ్రమ జీవన వేదం

Satyam NEWS

బోనాల వైభోగం

Satyam NEWS

Leave a Comment