23.7 C
Hyderabad
May 8, 2024 06: 01 AM
Slider కవి ప్రపంచం

స్వాగతం శుభకృతు

#MuluguLaxmimaidhili22

ప్రత్యూష కాంత నీలి వస్త్రం ధరించి

మేలి పొద్దును స్వాగతిస్తోంది

చైత్ర మాసపు గానరవళులతో

తెలుగుతనపు మధురభావనలతో

తొలిపండగ తెలుగువారి

ముంగిట్లో శ్రీకారం చుట్టింది.

ఏ చిత్రకారునికి అందని మనోహరదృశ్యం ..

పచ్చ పచ్చని లేమావి చివురులు

అరవిచ్చిన మల్లెల గుబాళింపులు

ఆమని రాకతో ప్రకృతిశోభ

ద్విగూణికృతమైంది

మనుగడలో మకరందాన్ని నింపి

షడ్రుచుల పరమార్ధం తెలిసేలా

జీవితం లో వసంతమై రావమ్మా..

తెలుగు తల్లిని వేనోళ్ళ కీర్తిస్తూ

మాతృభాష కు అక్షర హారతులతో

యుగాలకు ఆదివై, నవ్య ఉగాది వై

చేజారుతున్న సంస్కృతి సంప్రదాయాలను..నిలుపరావమ్మా

నీరాక తో ప్రతిఇల్లు మావిళ్ళతోరణాలతో

నవ్యశోభల సంతరించుకుంది

యువత వెన్నుతట్టే చైతన్యమూర్తివై

సజ్జలను సంరక్షించి

దుర్జనులను శిక్షించ రావమ్మా

కనబడుతున్న వైరాన్ని

కనిపించని వైరస్ ని

రూపుమాపి విశ్వశాంతి నివ్వమ్మా

శుభ కృత్ నామ వత్సరమా

స్వాగతం..శుభస్వాగతం..!!

ములుగు లక్ష్మీ మైథిలి, నెల్లూరు, ఫోన్: 9440088482

Related posts

అర్థరాత్రి రోడ్డుపై సరస్వతీ పుత్రులు.. ఏ క్షణాన్నైనా అరెస్ట్..!

Satyam NEWS

జనసేన పార్టీ చేసిన దాడి సహేతుకం కాదు..

Satyam NEWS

అరాచక పాలన అంతం కావాలి చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలి

Satyam NEWS

Leave a Comment