27.7 C
Hyderabad
May 16, 2024 05: 36 AM
కవి ప్రపంచం

దివ్యచరితుండు

#Koroprolu Radhakrishna Rao

సీ:శ్రీదత్తపుత్రుండు శ్రీదివ్యచరితుండు

పాములపర్తితా పరిఢవిల్లె,

స్వామిరామా నంద తత్వబోధనలోన

సత్యవాదిగతాను చరిత నిలిపె

విద్యార్థి దశలోన విప్లవ భావాల

వెలుగును జూపించి చెలగినాడు

మార్గంబు నెంచుచూ బూర్గుల పథమున

రాజకీయరచనరమ్యముగను

తే.గీ.శాంతి మంత్రము నెఱిగిన దాంతితాను

సద్దు సంక్షేమ పథకాల హద్దు దెలిపి

వస్తు వుత్పన్న మొనరించు పనులు నిలిపి

భాగ్య సంపద ‘పసిడిని ‘భావికొసగె

కొరుప్రోలు రాధాకృష్ణరావు

Related posts

కడిగిన ముత్యం

Satyam NEWS

చిదానంద స్వరూపుడతను

Satyam NEWS

ప్రబోధ గీతం

Satyam NEWS

Leave a Comment