26.7 C
Hyderabad
May 12, 2024 07: 30 AM
కవి ప్రపంచం

చిదానంద స్వరూపుడతను

#CSRambauNew

అసమాన ప్రతిభ నీది

అలుపులేని పరుగు నీది

దశదిశలా వ్యాపించిన ప్రభ నీది

మహోదయా..మహాశయా

ప్రగతిగీతమై ప్రభవించినావు

రాజకీయ చతురత నీది

ఇక్కట్ల ముడులు విప్పి

సంకటాల సుడులను దాటించి

దేశనౌకకు దిశను చూపినావు

తెలుగు తేజమై వెలుగు పంచినావు

కోటిరతనాల వీణను సవరించినావు

ప్రధాని పదవినే వరించిన

వంగర విలుకాడివి నీవు

సంస్కరణలను సాహిత్యాన్ని

రెండుకనుల వెలిగించిన తాత్వికుడవు

గుండెనిండ జనఘోషను నింపినావు.. ఈ గుండెన ప్రేమనే ఒంపినావు

ఆర్థికాన్ని దౌత్యంతో ముడివేసిన

అపర చాణుక్యడవు నీవు

“లుక్ ఈస్ట్” అంటూ దారులు వేశావు

మౌనం చాటిన మహాయోగివి నీవు

ఒక్కడివై దేశాన్ని నడిపావు

ఒంటరివై మిగిలావు

దుఃఖచింతనలేని నీ చిదానంద

స్వరూపమే..సదా మాగుండెలో…

సి.యస్.రాంబాబు

Related posts

వెన్నెల రేడు

Satyam NEWS

స్వాగతం శుభకృతు

Satyam NEWS

తొలకరి దృశ్యం

Satyam NEWS

Leave a Comment