42.2 C
Hyderabad
May 3, 2024 17: 35 PM
Slider వరంగల్

రామప్ప ముంపు బాధితులకు సేవా భారతి సేవలు

#SevaBharathi

ములుగు జిల్లా కేంద్రంలో భారీ వర్షాలతో నిరాశ్రయులైన వారికి సేవా భారతి స్వచ్చంద సేవా సంస్థ అరటిపండ్లు, వ్యాధి నిరోధక హెర్బల్ టీ పంపిణీ చేసింది. ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో రామప్ప ముంపు బాధితులకు పునరావాస సహాయ శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ శిబిరంలో పాల్సాబ్ పల్లి గ్రామానికి చెందిన 60 మంది ఆశ్రయం పొందారు. వీరందరికి సేవా భారతి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అరటిపండ్లు, వ్యాధి నిరోధక హెర్బల్ టీ పంపిణీ చేశారు. అత్యధిక వర్షాల వల్ల నిరాశ్రయులైన బాధితులకు చేయూతనిస్తున్న సేవా భారతి కార్యకర్తలను ములుగు మండల రెవిన్యూ అధికారి సత్యనారాయణ ప్రశంసించారు.

అదే విధంగా ములుగు గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు 45 మందికి రోగ నిరోధక హెర్బల్ టీ ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవా ప్రముఖ్ చల్లగురుగుల మల్లయ్య సేవా భారతి కార్యకర్తలు దొంతిరెడ్డి బలరాం రెడ్డి,కొత్తపల్లి పోషన్న,భాష బోయిన మహేందర్,గొల్ల కుమార్,కొత్త రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

“అందరి గెలుపునకు ఎంపీ ఆదాల రొట్టె”

Bhavani

హాట్ కామెంట్ చేసిన ఈటలతో సీఎం కేసీఆర్ సమావేశం

Satyam NEWS

ఎఫ్‌.3 : పూజా హెగ్డే పార్టీ సాంగ్ షూటింగ్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment