33.7 C
Hyderabad
April 29, 2024 02: 51 AM
Slider కవి ప్రపంచం

కడిగిన ముత్యం

#V V Krishna Mohan

వంగర దొరవైన నీవు

అఖిల భారతావనికి నాయకుడైనావు

బంగారం తాకట్టు పెట్టినట్టి అప్పుల్లోని

భారతావనికి భాగ్యమందించినావు

రాజీవు మరణ చీకటిలోనున్న

భారతావనికి కాంతి పుంజమైనావు

రాజకీయ బలము లేకున్నా ఆర్ధిక

శాస్త్రజ్ఞుడిని మంత్రి గా చేసినావు

ఆర్ధిక సంస్కరణలతో ప్రపంచ దేశాలలో

మన పరువు నిలిపినావు

సభలో ఆధిక్యం లేకున్నగాని

ఆధిపత్యం పూర్తిగా నిలుపుకున్నావు

కుహనా నాయకుల కుట్రలెన్నింటినో

ఎదిరించి పూర్తికాలం పాలించినవు

ప్రతిపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేసే

అపర చాణక్యుని వంటి ధీరుడవీవు

అనేక కుంభకోణాల కుట్రలనుంచి

కడిగిన ముత్యము వలె బయటకు వచ్చితీవు

విశ్వనాధ మహాకావ్యాన్ని హిందీ బాషలో

అనువదించి అందించిన మహా కవివి నీవు

బహుభాషా కోవిదుడైన మహా మౌనివి

కవితాంజలులు తప్పఏమీయగలము నీకు

వి వి కృష్ణ మోహన్, సెల్  9052496284

Related posts

తిరుమలలో జనవరి నెల ప్రత్యేక ఉత్సవాల క్యాలెండర్ ఇది

Satyam NEWS

తెలుగు రాష్ట్రాలకు మర్కజ్ మసీదు టెన్షన్

Satyam NEWS

రుషికొండకు సిఎం జగన్ పరుగో పరుగు

Satyam NEWS

Leave a Comment